Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సంస్కృతి కి నిలువుటద్దం
సోదర,సోదరీమణుల అనుబంధాలను
మెరుగుపరుచును ఈ రక్షాబంధం..!
సురానుబంధ రూపేణ అవతరించిన
ఆదర్శ పండుగ రక్షాబంధన్...!
అన్నా చెల్లెల్ల,అక్కా తమ్ముల్ల
అనురాగ బంధాలకు సజీవ సాక్ష్యం...!
సోదరభావంతో మనస్పర్ధల తిమిరాన్ని
పారద్రోలి ఆప్యాయతల వెలుగును
పంచే పౌర్ణమి - ఈ రాఖీ పౌర్ణమి..!
ధనమును మోహించి అనుబంధాలను
త్యజించిన వారికి కనువిప్పు
ఈ శ్రావణ పౌర్ణమి....!
హృదయాంతరాలనుండి పెల్లుబికిన
వాత్సల్యపు గీతపు పల్లవి ఈ బంధం..!
మానవ జీవన యానంలొ
బంధాలను బలోపేతం చేసే పండగే
ఈ రక్షాబంధన్...!
తన ప్రవాహ వాహిని లో ఎన్ని మలినాలు
మిలితమైనా, తన పవిత్ర ను ప్రసరించే
పవిత్ర నదీమతల్లీ లాంటి సుగుణమే
ఈ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల్ల బంధం.!
భారతీయుల అందరికీ
"" శుభాకాంక్షలు....!
రచన
ఆకుల. వెంకటరమణ
ఊరు : నసర్లపల్లి ( నల్గొండ జిల్లా)
చరవాణి నెం : 94417 17212