Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాపు బొమ్మలా
నా హదయ తరంగాల పచ్చని చేలో
పరిమళ పువ్వైనావే
సిరివెన్నెల పాటల మూటలా
నా ఆలోచన సవ్వడిలో స్వాతిముత్యమై
మెరిచినావే
వేటూరి వెన్నెలధారల
కన్యమనసుతో
నా వలపు సొగసుకు చెలిమి పిలుపు పంపినావే
నేను నీ హదయ పంజరంలో చిక్కుకున్న పావురాన్నే
నీవు చూపుల గారడీతో నా మదిని బందించిన సౌందర్య లోక సౌధామినివే
ఎలా వర్ణించను
కలలకు చిక్కని నీ చిలిపితలపుల భావతరంగాల
మధురభావన పెదవి ఉలితో చెక్కిన
సొట్టబుగ్గల చిలిపి ఊహాలను
వర్ణించుట చేతకాక
ఆస్వాదిస్తూ
అర్ణ స్పర్శకు పులకించిన పారిజాత పుష్పమైనా నీ మధుర తేనెను ఆస్వాదించే తుమ్మెదై
నిలిచిపోయాను ప్రియతమా
- అభిరామ్,
9704153642