Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా నీడలాగ నాతోనే నువ్వుంటె చాలులే
వీడిపోక కడవరకూ నా తోడుంటె చాలులే
అలసిన నా హదయానికి ఊరట నీ మాటే కద
నీ పలుకులనే కలకాలం వింటుంటె చాలులే
నా నవ్వుకి ఆనవాలు నీ అందెల రవమే కద
ఆ అందెలు ఎల్లప్పుడూ ఘల్లుమంటె చాలులే
ఎదకు వలపువల విసిరినది నీ సుందర మోమే కద
ఆ వదనం వెన్నెలలా వెలుగుతుంటె చాలులే
జీవితాన ప్రణయ గీత పల్లవివై నిలిచావే
ఈ కష్ణుడికి రాధవై నా వెంటుంటె చాలులే
- ప్రగతినివేదిత
ట్రిపుల్ ఐటీ, బాసర