Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షిస్తోంది ఈ రాతిరి
చినుకులుగా చీకటిని...
మేఘాల దోబూచులాటలో
అలసిన వెన్నెలిపుడు
అపురూపంగా జారుతోంది
చీకటి చినుకులను మెరిపిస్తూ...
కిటికీ పక్కన సన్నజాజి తీగతో
గాలికన్ని కబుర్లేమిటో....
విరబూసిన జాజిపూలు
పక్కున నవ్వినట్లు
నా గదిలోనికి వచ్చిన పరిమళం
మదిలో కూడా సందడి చేస్తోంది...
మొన్నెపుడో మనసు వనంలో
పాడిన కోయిల
మళ్ళీ కచేరీ చేస్తున్నట్లు
తీయని అనుభూతి...
ఓరు....
గారడి చేస్తున్న మనసుకిపుడు
ఆంక్షలు విధించొద్దు...
అల్లుకు పోయిన తలపుల లాహిరిలో
వెల్లువ గోదావరిలా మారిపో...
అందుకే....
వర్షించనీ ఈ రాతిరిని
చినుకులుగా చీకటిని
మెరుపులుగా వెన్నెలని...!!
- శాంతి కష్ణ
9502236670