Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమించే మనసుంటే ప్రతీక్షణం సుందరమే
ఆమెతోటి కలిసుంటే ప్రతీక్షణం సుందరమే
ఎన్నొరోజుల కలలన్నీ నేడునిజం అవుతుంటే
చెలిమదిలో నీవుంటే ప్రతీక్షణం సుందరమే
తనచూపుల చిరుజల్లుల తేనెవాన డల్లులాగ
హదయంలో పడుతుంటే ప్రతీక్షణం సుందరమే
తనమాటలు తూటాలై గుండెనంత గాయపరిచె
తనఎదలో నేనుంటే ప్రతీక్షణం సుందరమే
తనమనసున స్థానమిచ్చి ప్రేమెంతో చూపిందిగ
నీడలాగ తానుంటే ప్రతీక్షణం సుందరమే
మనసుపడిన కనులలోని తెరచాటున తనరూపము
దాగుందని తెలిసుంటే ప్రతీక్షణం సుందరమే
ఎడబాటు కలతతోటి నిండిఉన్న నీ మనసుకి
ప్రేమపంచె మనిషుంటే ప్రతీక్షణం సుందరమే
బాధలలో ప్రతిఒక్కరు దూరమైతే ఓ కార్తిక్
నీ ఊహలె తోడుంటే ప్రతీక్షణం సుందరమే
-జోడు కార్తిక్ 9390617667