Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలలు కనడము
తప్పేమి కాదు..
ఆశల రాసుల్ని గుప్పిట్లో
పట్టుకొని కోరికల
సెలయేరులై ఎగరడం
అత్యసేమి కాదు..!
అందం! బంధం అయితేనే
బాధ.. సమన్వయం లేని
జీవన గానం.. శతులు తప్పి
మూడు ముళ్ళ బంధం
భవిష్యత్తు
అగమ్య గొచరమే!
చీకటితో సహజీవనం చేయడమే..
బతుకు గదిని బంధికానా చేయడమే!
అలసిపోతున్న అటుపోట్లకి
ఆలంబనయి
స్వేచ్చ గీతలతో చెట్ట పట్ట లేసుకొని
ప్రేమ అనురాగాల్ని
ఒడి చేర్చుకొని..
సరియైన లక్ష్య సాధనే
జీవిత పరామవాదిగా..
కొత్త కాంతుల సష్టికి
ఆప్యాయత అనుబంధాలు
ప్రేరణ కావాలి..
అపుడే జీవితం
నిత్యం పూసే పువ్వు లా
వికసిస్తుంది!
నిరంతర సాధన..
ప్రశాంత జీవనాన్నికి
హాయినిస్తుంది..
తీరం చేరిన నావల!!
- రవీందర్ కొండ
9848408612