Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనం మాట్లాడుతుంది నిశబ్దంతో
ప్రశ్నిస్తుంది కూడా
లక్షల గొంతులతో
సమాధానాలు చెబుతుంది
కొట్లాది భావాలతో
దేహమంతా కళ్ళు చేసుకుని
వీక్షిస్తుంది
కళ్ళు కాయలు కాచేలా
నిరీక్షిస్తుంది
యుగాలపాటు సహనంతో
స్పశిస్తుంది
గుండె లోతుల్లో దాగిన అంతరంగాల్ని పలికిస్తుంది
అనంత రాగాల్ని అద్భుత గాత్రంతో ఆలపిస్తుంది
విషాద గీతాల్ని
కన్నీరొలికిస్తుంది
మరిన్ని కొత్త సముద్రాలు ఏర్పడేంతగా భరిస్తుంది
భీకర ప్రళయ ఘర్జన విస్పోటనాల్ని మోస్తుంది
చింతల్ని చికాకుల్ని
తనతో తానే సంఘర్షిస్తుంది
పుట్టెడు దుఃఖాన్ని భాదతో వేదనతో తనను తానే దహించుకుంటుంది
చేతకానితనంతో
చేవలేని తత్వంతో
మౌనం భళ్ళున బ్రద్దలవుతుంది
ఓపిక నశించిన క్షణాన
మౌనం కరిగిపోతుంది
మంచు ముక్కలా చల్లగా మెల్లగా
మౌనం పెరిగిపోతుంది
వామనుడి మూడోపాదంలా
మౌనం అంటే ధరిత్రి
అనంతానంత చరిత్రి.
- రజిత కొండసాని.
9652838920.