Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాధికామయ రసహదయ నివేదిత
అందానికే గంధమైన అద్వితీయత
అణువణువు నిండిన మధుమిత
మనసులు కలిపిన మనోరంజిత
నా మానస సరోవర సమ్మోహిత
మది నిండా పలుకుల పులకింత
ఊసుల అలల సడిలో గిలిగింత
చెంత చేరి నిలువవే అపరంజిత
నీ ధ్యాసలో దినమొక భావగీత
జీవితాన్ని నిలిపేటి మధుమిత
అనుబంధమే మన మహౌద్ధత
వదిలేయకే వలపుల విరహిత
వెన్నెల వెలుగు పంచే విలసిత
నా గుండెలో కొలువైన దేవత
కలిసుంటే కలదు మన భవిత
వికసించే నవ్వుల కుసుమిత
విడిపోతే మిగులునులే కలత
పెరగాలిలే మనలోని మమత
హదయాల ఏకమైతేనే జత
నిలవాలి నిత్యం మన చరిత
మనసులో నిండిన విరచిత
నీకే అంకితం ఈ చిరుకవిత!
- పుట్టి గిరిధర్
9491493170