Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కాలపు గాయాలను మరచి నవీన జీవనానికి అడుగు వేసి భవిష్యత్తుకు రాజమార్గాన్ని ఎంచుకొని అనుభవాలు అనుభూతులను గుండెలో నింపుకొని నూతనోత్తేజంతో నూతనసంవత్సరాన్ని స్వాగతం పలుకుదాం
మనలోని దుర్గుణాలకు సమాది కట్టి సద్గుణాలకు పునాది వేసి అవనిలో మమత సమతను పూయించి నవీన సంస్కార భారతానికి నిర్మాతలవుదాం
గతి తప్పిన లక్ష్యాలను గాడిన పెట్టి స్వయంకషియే అంతఃస్సూత్రంగా సాధనే వజ్రాయుధమై జీవిత లక్ష్యాన్ని గెలిచి భావితరానికి స్పూర్తి నింపే
సూత్రదారులవుదాం
తేదిలు మారుతున్నట్టే జీవన విధానాన్ని మార్చుకుంటూ ధరలో బహుదూరమైన మానవత్వమనే అమతాన్ని నింపి మానస సరోవరం చేసి మంచి మనుషులవుదాం
నేటి పాశ్చత్య సంస్కతిలో శిథిలావస్థలోని భారతానికి వసుధైక భారతతత్వమనే
భోదనతో మరమ్మత్తులు చేసి నవీన భారతానికి నాంది పలుకుదాం
రండి మనుషుల మధ్య అంతరాలు తెంపి జాతిని ఐక్యం చేసి అవనిలో ఆనందాన్ని నింపి
భువిని భూతలస్వర్గం చేద్దాం
- డి.అమీర్
9642480702