Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ చమట ధారలే
ఈ పునాదులు
నీ రెక్కల కష్టాలే
ఈ నిలువెత్తు గోడలు
నీ అడుగుల ముద్రలే
ఈ పాలరాతి నునుపులు
నీ చేతి పిడికిల్లే
ఈ మట్టి ముద్దలు
నీవు లేకపోతే
ఈ నీటి ధారలు ఎక్కడివి
నీవు రాకపోతే
ఈ నిలువు రాయిలెక్కడివి
నీవు చెక్కకపోతే
శిల్ప సౌందర్యం ఎక్కడిది
నీ స్వేదం ఇంకని మట్టి లేదు
ఆ మట్టి అంటని మేడ లేదు
పలుగు చప్పుడు నీవే
పలుకు రాతివి నీవే
ఎన్ని గాయాల్లి దులిపేసావు
ఎన్ని కోతల్ని చెరిపివేసావు
నీ నరాల బిగువులే
నింగిని అంటిన కట్టడాలు
నీ కండరాల గట్టిదనమే
దఢమైన గహౌపకరణాలు
నడిచే దారులు
నడిపే వాహనాలు
ఎన్నో రూపాలుగా నీ కష్టఫలం
ఎన్నో ఉపయోగాలుగా
నీలోని త్యాగ గణం
- నరెద్దుల రాజారెడ్డి
9666016636