Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకోసం వేచి ఉన్న సంద్రాన్ని నేను
నన్నావరించిన ఆకాశం నువ్వు
పున్నమినాటి నీ వెలుగును చూసి
ఉన్నపలంగా నిన్నందుకోవాలని
ఆటు పోటులై ఎగసిపడుతుంటాను
నిన్నందుకోవాలనె తాపత్రయంలో
నీవెప్పటికీ అందనంత దూరంలో ఉన్నావనె
నిజాన్ని మరిచి నిత్యం ప్రయత్నిస్తుంటాను
- దిలీప్.వి,
8464030808