Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం అను పాఠం
నీకు అబ్బింది అంటే,
జీవం అను అమృతం
నూరి పోసింది.... ఆమె.
నీ తప్పటడుగులు చూసి
తట్టి లేపి అడుగులుగా
మార్చి మురిసింది... ఆమె
బంధాలకు, బంధుత్వాలకి
నీకు చోటు దొరికింది అంటే
పేగు బంధం పంచి
పెంచింది.... ఆమె.
అక్షర మాలలు
నీవు అల్లుతున్నావు అంటే..
ఓనమాలు నేర్పింది... ఆమె
లోకజ్ఞానంలోని లోటుపాట్లు
నీకు తెలిసివచ్చాయి అంటే,
నీకు లోకం చూపింది...ఆమె
బరువు, బాధ్యత
కలిగి నడుచుకుంటున్నావు
అంటే, బాధలు దిగమింగుకుని
నిను తీర్చిదిద్దింది ...ఆమె
శిఖరాన్ని నువ్వు తాకావు, అంటే
శిలలా జీవితాంతం
నిను మోసింది... ఆమె
ఆమె.....?
నీ అణువణువునీ సష్టించిన అమ్మ.
నీ అడుగడుగున తోడుండే అక్క.
నీ అడుగుజాడలో నడుచు చెల్లి.
నీ తోడై, నీకు నీడైన నీ భార్య.
నీ జీవమే జీవితంగా
రూపుదాల్చిన కూతురు.
నీ ప్రపంచమే, ఆమె అయినపుడు.
ప్రేమించకుండా..! పగబడతావే?
తప్పు చేసి పాపం అనుకోకు,
సరిదిద్ది క్షమాపణ వేడు.
అనంతమైన ప్రేమ తనది
అపారమైన వరాలు
ఇస్తూనే ఉంటుంది.
- ఆదిమల్ల జాహ్నవి
8897950301