Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ ఎన్నో
వర్ణాల సముదాయం
చీకటి కొన్ని
వెలుతురు మరిన్ని
ప్రేమంటే
అనంతమైనది
మితం హెచ్చిపోతే
విరిగే శిఖరమది
ప్రేమంటే
కొలమానం లేనిది
లెక్క కడుతూ
అడుగుల్ని లెక్కిస్తుంది
ప్రేమంటే
మిక్కిలి పవిత్రమైనది
ప్రే 'మించితే '
పతనానికి దారది
ప్రేమంటే
ఆగిపోని భ్రమణం
తన్ను తాను మరిచే
భ్రమకు ప్రతిరూపం
ప్రేమంటే
చిరునవ్వుల చిత్రం
పగిలిపోతే `
అతుక్కోని అద్దం
ప్రేమంటే
మరచిపోని జ్ఞాపకం
తరిగిపోని
ఎనలేని వ్యాపకం
- నరెద్దుల రాజారెడ్డి
9666016636