Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటే గమ్యాన్ని మార్చే సాధనం
ఓటే రేపటి నిర్మాణానికి ఆధారం
ఓటే కరములోనున్న ఆయుధం
ఆకలి దప్పికను గమనించు
దోచుకునే వ్యవస్థను చూపించు
తోటివారిని చైతన్య పరుచు
కాకమ్మ కథలకు కరిగిపోకు
గాల్లో లెక్కలకు తెలిపోకు
ఆశల వలకి చిక్కుకుపోకు
పట్టా భద్రుడా !! మేలుకో
తెలివుంది, ఆలోచించే శక్తినీకుంది
కలముంది మార్చే బలం నీకుంది
నీ నిర్ణయంపై భవిత ఆధారపడింది
నిరుద్యోగం నానాటికి పెరుగుతుంది
ప్రశ్నించే గొంతుక మూగబోతుంది
ఉపాధి లేక ఇల్లు కళ తప్పుతుంది
పట్టా భధ్రుడా ఆలోచనే నీ శక్తి !!
- మహేష్ వేల్పుల
9951879504