Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహలతోటలో
భావాలతీవలపై
అక్షరాలమొగ్గలను
అందమైన మాలికలుగా
మారుస్తూ
పరవశింపచేసే
పదవిన్యాసమే
కవిత్వం
ఉద్వేగాలకు ఊతమై
అంతరంగతరంగాలలో
అడుగడుగునా నినదించే
వేదనాతరంగాలకు దర్పణమై
మధురస్వప్నాల
ఆవిష్కర్తై నిలిచేదే
కవిత్వం
చైతన్యం రగిలిన
మనసులోని అనుభూతులు
అక్షరసాన్నిహిత్యంతో
పరిమళించగా
హదయ సీమాంతరాలు దాటి
రసహదయాలను తాకేదే
కవిత్వం
సమాజహితంకై
సమరంసాగించే
అద్భుతమైన పదాలప్రోవే
కవిత్వం
సజనాత్మకతతో
ఆలోచింపచేస్తూ
మనసును
రంజింపచేసే ప్రక్రియే
కవిత్వం
విషయమేదైనా
ఆసాంతం అవగాహనతో
ఆలపించేహదయగానమే
కవిత్వమంటే..
- వేమూరిశ్రీనివాస్
9912128967