Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధుత్వాలు దూరంగా
బదిలీ అయ్యె కొద్ది
శ్వాసకోశకు
అంటురోగం సోకుతుంది
గాలి ఆడని దేహం
జనాలతో '' కల్ల '' తిరగాలని
ఆశ పడ్డా..
పాద ముద్రలు గడప దాటనివ్వట్లేదు
దగ్గరగా నడిచే నడకలల్లో
భయానక జ్వాలలు
చెమ్మగిల్లుతూనే ఉన్నాయి
వేలు పట్టి పలకపై
అక్షరాలను దిద్ధిపించిన గురువులే
పుస్తకం అనే వైకుంఠంలో..
పేర్చిన పదాలకు
పేజీ నంబర్లు అవుతున్నరు
మత్యువు ఊబిలల్లో
చిక్కిన రోగి తాలూకా
సహాయం చేసే చేతులు
వెనక్కి ముడుసుకుంటున్నాయి
పేగు బంధాన్ని కూడా
దరికి చేరనివ్వని పరిస్థితులు
'' ఆయిరమ్ '' ఆలోచనలు
ప్రశ్నలుగా మారుతున్నాయి
చులకనగా చూసే ఆత్మీయుడే
ఇప్పుడు భుజాన శవాన్ని మోస్తుండు..
అండగా నిలబడ్డడని
గర్వపడాలా..?
పాణాన్ని పనంగా పెట్టిండని
బాధపడాలా..?
కడుపుకోతల '' ఘోష '' వింటుంటే
మౌనబోయిన కన్నీరు
బిర్రుగా బిగిసి కూర్చుంది
ప్రేమని సంపాదించలేని
ధనం
నీ కోసం..బొట్టు కన్నీరును కూడా
కొనలేకపోయింది..
ధీనంగా కూసున్న భుజాన
చేతులెట్టి ఒదార్చలేని ప్రేమలు
కాలం ఒడిలో చిక్కుకుపోయినరు
తేనెటీగలలెక్క ముసురే మనుషులు
ముళ్ళు దిగిన నొప్పులతో
మంచాన పడ్డ..
'' కల్తీ నవ్వులను '' చూస్తుంటే
ప్లాస్టిక్ కవర్లల్లో చుట్టిన
మాంసపు ముద్దలు గుర్తోస్తున్నై
కంటతడిని తాకలేని మనుసు
గుండె నిబ్భరాన్ని నింపలేని మాట
కనుగుడ్డెత్తి చూడలేని సూపు
కాలంతో ఒంటరిగా పోరాడమంటున్నై..!
- బి. తాళ్ళపల్లి శివకుమార్
సెల్: 9133232326