Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం...
'ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్'
చాంద్నీ దిల్ దుఖాతీ రహీ రాత్ భర్
గాV్‌ా జల్తీ హుఈ గాV్‌ా బుజ్తీ హుఈ
శమ్-ఎ-ఘమ్ ఝిల్మిలాతీ రహీ రాత్ భర్
కోఈ ఖుషఉ్బ బదల్తీ రహీ పైరహన్
కోఈ తస్వీర్ గాతీ రహీ రాత్ భర్
ఫిర్ సబా సాయ-ఎ-శాఖ్-ఎ-గుల్ కే తలే
కోఈ ఖిస్సా సునాతీ రహీ రాత్ భర్
జో నా ఆయా ఉసే కోఈ జంజీర్-ఎ-దర్
హర్ సదా పర్ బులాతీ రహీ రాత్ భర్
ఎక్ ఉమ్మీద్ సే దిల్ బహల్తా రహా
ఇక్ తమన్నా సతాతీ రహీ రాత్ భర్
అనువాదం...
'నీ తలపే ఛేదిస్తూ ఉన్నదిలే రాతిరంత'
ఆ వెన్నెల వేధిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఒక్కసారి మండుతూనె మరోసారి ఆరుతుంది
దిగులుదీపం మెరిపిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఏదో ఒక సువాసన తన వేషం మార్చుతుంది
దశ్యమొకటి పాడేస్తూ ఉన్నదిలే రాతిరంత
పూలకొమ్మ వేసినట్టి చలచల్లని ఛాయకింద
ఏదో కథ వినిపిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఇప్పటకీ రానివార్ని ఏదో ఒక తలుపుగొలుసు
ప్రతిసారీ పిలిపిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఒక ఆశతొ గుండె సేద తీరుతుంటె దానితోడు
ఒక కోరిక బాధిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఉర్దూ సాహిత్యంలో శక్తివంతమైన ఫైజ్ కవిత్వం దౌర్జన్యాన్ని నిరసిస్తూ, ప్రేమను, మానవతావాదాన్ని పరిమళింపజేస్తుంది. 1994లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్, లెనిన్ శాంతి పురస్కారం (1962), పాకిస్తాన్ దేశ అత్యున్నత పురస్కారమైన నిశాన్-ఎ-ఇమ్తియాజ్ (1990) మొదలైన పురస్కారాలననెన్నిం టినో అందుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ (సాహిత్య) పురస్కారానికి కూడా నామినేట్ అయ్యాడు. కవిగా, ఆచార్యుడిగా, బహుభాషావేత్తగా, కమ్యూనిస్టుగా, ఉన్నత సైనికాధికారిగా ఇంకా మరెన్నో క్షేత్రాలలో విస్త్రుతానుభావాల జ్ఞానం కలిగిన మానవతావాది ఫైజ్ అహ్మద్ ఫైజ్, 1911లో పాకిస్తాన్ లోని సియాల్కోట్ లో జన్మించాడు. లాహౌర్ గవర్నమెంట్ కాలేజ్ నుండి ఆంగ్లం, అరాబిక్ లో మాస్టర్స్ చేసిన ఇతను, తన కాలేజీ రోజుల నుండే షేరో షాయరీ పైన మక్కువ పెంచుకున్నాడు. దేశ స్వాతంత్య్రానికంటే ముందే సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని స్వీకరించిన ఫైజ్, 1936 సం. బ్రిటీషిండియాలో జరిగిన అభ్యుదయ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖుల్లో ఒకడు. ఫైజ్ అదబ్-ఎ-లతీఫ్, పాకిస్తాన్ టైమ్స్ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. నఖ్శ్-ఎ-ఫర్యాదీ, దస్త్-ఎ-సబా, జిందాన్-నామా మొదలైనవి ఇతని రచనలు. ప్రత్యేక పాకిస్తాన్‌ని కోరుకున్న కూడా, ఫైజ్ 1947లో జరిగిన కాశ్మీర్ యుద్ధం తరువాత సైన్యం నుండి రాజీనామా చేసాడు. ఆ తరువాత ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకించిన ఫైజ్, పలు మార్లు తన విప్లవ భావాల వల్ల ఖైదు చేయబడ్డాడు. తనని, తన కవితలను పాకిస్తాన్లో ఎంత అదరిస్తారో, భారత్ లో కూడా అంతే ఆదరిస్తారు. ఫైజ్ కి మఖ్దూం మొదలుకొని ఎందరో విప్లవకారులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఫైజ్ కవిత్వం అంతర్జాతీయ భాషలలో అనువదింపబడింది. రషియన్ ప్రభుత్వమైతే ఫైజ్ ''మా కవి'' అని చెప్పి గౌరవించింది. ఉర్దూ సాహిత్యంలో శక్తివంతమైన ఫైజ్ కవిత్వం దౌర్జన్యాన్ని నిరసిస్తూ, ప్రేమను, మానవతావాదాన్ని పరిమళింపజేస్తుంది. 1994లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్, లెనిన్ శాంతి పురస్కారం (1962), పాకిస్తాన్ దేశ అత్యున్నత పురస్కారమైన నిశాన్-ఎ-ఇమ్తియాజ్ (1990) మొదలైన పురస్కారాలననెన్నిం టినో అందుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ (సాహిత్య) పురస్కారానికి కూడా నామినేట్ అయ్యాడు.
దాదాపు అందరు గజల్ గాయకాగ్రేసరులు పాడిన ఫైజ్ గజళ్ళు, ఉర్దూ సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఫైజ్, మఖ్దూం ఇద్దరూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) లో సభ్యులు. మఖ్దూం మరణించాక తన స్మతిలో తను రాసిన గజల్ లోని మొదటి పాదంతో ఫైజ్ మరో గజల్ రాసాడు. ఆ గజల్ నే ఈ కాలమ్ లో తెలుగు గజల్ నియమాలతో అనువదించడం జరిగింది. ఈ గజల్ సన్నివేశం కూడా వెన్నెల రాతిరే. కాకపోతే దీని వాతావరణం ఆహ్లాదకరంగా కాకుండా విచారకరంగా ఉండి కవిలోని ఆశావాదాన్ని ప్రకటిస్తుంది. మఖ్దూం గజల్ మ్యాజికల్ మ్యూజ్ లాగా అనిపిస్తే, దానికి భిన్నంగా, ఫైజ్ రాసిన ఈ గజల్ లో మాత్రం ట్రాజికల్ మ్యూజ్ (ుతీaస్త్రఱషaశ్రీ వీబరవ) అంటే విషాధఛాయ గోచరిస్తుంది. పైగా ఈ రెండు గజళ్ళలో ప్రయోగించిన భాష ఎంతో సహజమైనది. అన్ని పదాలూ వ్యవహారంలో ఉన్నవే. అందరికీ తెలుసినవే. సౌదా వంటి కవులెందరో దీర్ఘమైన ఫార్సీ సమాసాలను, ప్రౌడ భాషను ఉపయోగించారు. కాని వారి గజళ్ళు జనాల్లో ప్రాముఖ్యం పొందలేదు. ఎందుకంటే గజల్ శిల్పం ఎంతో సున్నితమైనది. అది కఠిన పదాలను, భావరహిత శబ్దాలంకారాలను తట్టుకోలేదు. అయినా అవన్నీ లేకుండానే గజల్ శ్రోతలను మెస్మరైజ్ చేస్తుంది. గజల్ కవులు వారి భావాలను సూటిగా చెప్పకుండా ప్రతీకాత్మకంగా (ూyఎbశీశ్రీఱరఎ) వెల్లడిస్తారు. వారు ఉపయోగించే ప్రతీకలు శ్రోతల మనసులను భావ వాతావరణానికి తీసుకెళ్తాయి. ఆ ప్రతీకలకు అనుగుణమైన పదాలు భావ సౌందర్యాన్ని, తీవ్రతను అనుభూతి చెందేట్లుగా చేస్తాయి. ఉదాహరణకు మఖ్దూం, ఫైజ్ రాసిన ఈ గజళ్ళనే తీసుకుందాం. రాత్రి అనేది ఆహ్లాదకరంగానూ, విషాదకరంగానూ ఉంటుంది. ఆ ఆహ్లాదాన్ని మఖ్దూం జ్ఞాపకాల చందమామ వెన్నెల మొదలైన ప్రతీకలతో వెల్లడిస్తే, ఫైజ్ రాత్రి విషాదాన్ని వెన్నెల వేధిస్తుంది మొదలైన ప్రతీకలతో వెల్లడించాడు. ఇక్కడే కవులకుండే కవితానిర్మాణ నిర్వాహణ నైపుణ్యం అవగతమవుతుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
సెల్: 9441002256