Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కోసమే ఈ నిరీక్షణ
నీ ప్రేమకై వేచి ఉన్నా.
నువ్వు రావని తెలిసినా
నీ మాట నా వరకు చేరలేకున్నా
వినదే ఈ హదయం
ఈ సత్యాన్ని మరువదే
నా మనసు.
నీ మదిని మిగిలిస్తూ..
ఆరని కన్నీటిని
అరక్షణం మరపిస్తూ..
నీ ఊహల ఊయలలో
ప్రతిక్షణం బాధిస్తూ..
ఈ గుండె భారంతో
ఇంకెంత కాలం ఈ నిరీక్షణ..
చివరకు నా తుది శ్వాసలోనైనా
నా తోడుండవా..ప్రియతమా..
- సుచిత్ర గూడూరు
ఐఐఐటి బాసర