Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యాలెంట్‌ను చాటుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు లఘుచిత్రాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అందులో చాలా కొద్ది మందిమాత్రమే డాక్యుమెంటరీలు తీసి మెప్పించగలరు. అలాంటి అతి కొద్దిమందిలో ఈ పోచంపల్లి యువకుడు ఒకడు. తన ఊరి కథనే డాక్యుమెంటరీగా మలచడంతో తన తొలి అడుగు వేసి మూడు పదుల వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించు కున్నాడు. నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి చేనేత కార్మికుల జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే 'విజయ' బావుటా ఎగరేసిన యువదర్శకుడు విజరు కుమార్ బడుగు సక్సెస్ స్టోరీ ఈవారం జోష్..
మాది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి. మాది నిరుపేద చేనేత కుటుంబం, నాన్న బలరాములు చేనేత కళాకారుడు, అమ్మ ఇందిరా. చేనేతే మా కుటుంబానికి ఆధారం. 8వ తరగతిలో ఉండగానే మొదటిసారి నాటకాల్లో నటించాను. అప్పటి నుంచే చిన్న చిన్న కథలు రాయడం వాటిని గణపతి, దుర్గదేవి నాటకాలుగా ప్రదర్శించడం చేసేవాన్ని. అలా 2011లో మా ఊరి కథనే భూధానోద్యమం, పోచంపల్లి చరిత్రపై మొదటి డాక్యుమెంటరీ చిత్రం ''భూధాన గంగోత్రి'' కి నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డు -2011 లభించింది. అది నా తొలి విజయం. అప్పటినుండి సామాజిక నేపథ్యంలో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్, సోషల్ అవేర్నెస్ యాడ్స్ చేసాను. వివిధ జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు ప్రోత్సాహం ఎప్పుడూ నాకు సలహాలు ఇస్తూ ప్రోత్సహించారు. నేను ఎంబీఏ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో మేనేజర్‌గా 2013 నుండి 2020 పని చేసాను. ఆ తరువాత కరోనా ప్రభావంతో ఆ కంపెనీ ముంబైకి మార్చారు. నాకు ముంబై వెళ్లడం ఇష్టంలేక జాబ్ కు గుడ్ బై చెప్పి.. నా అభిరుచిపై దష్ఠి పెట్టాను. తరాల పరమేష్ యాదవ్, తడక వెంకటేష్, ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్, తడక రమేష్, మిత్రులు అశోక్ నిమ్మల, శ్రావణ్ కుమార్, సురేష్, సైని భరత్, ముషం మధు, సాయికష్ణ తల్లాడ సహకారంతో కథ- మాటలు - దర్శకత్వంలో ప్రావీణ్యత సంపాదించాను. 2014లో తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యం, సంస్కతి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షపై తీసిన ''మహా వక్షం'' డాక్యుమెంటరీని తెలంగాణ ఆచార్య జయశంకర్ సర్ ఆవిష్కరించడం నాకు ఒక మధుర జ్ఞాపకం.
హైదరాబాద్ రవీంద్రభారతిలో 2017 సినివారం చలనచిత్రోత్సవంలో తెలంగాణ భాష సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరి కష్ణ నుండి పురస్కారం అందుకున్నాను.
- 2014 ఏప్రిల్ జనరల్ ఎలక్షన్స్ పై ప్రజల్లో అవగాహనకై ''EVM మిషన్ల''పై నల్లగొండ జిల్లా ప్రభుత్వం సహకారంతో తీసిన లఘుచిత్రానికి అప్పటినల్లగొండ కలెక్టర్ టి చిరంజీవులు ప్రశంసించారు.
- 2015లో చేనేత సంక్షోభంపై తీసిన ''ది హర్ట్'' లఘు చిత్రానికి అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ టి చిరంజీవులు ప్రశంసించారు.
-2015లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజలకు సామాజిక స్పహ కల్పించాలని నల్లగొండ జిల్లా ప్రభుత్వం సహకారంతో ''మనకోసం మనం'' లఘుచిత్రం.
8 2016లో తెలంగా ణలో గుడుంబా- మద్యపానం నిషేధించాలని ప్రజల్లో అవగాహన కల్పంచు టకై ''రేపటి కోసం'' లఘు చిత్రం నిర్మాణం - తెలంగాణ రాష్ట్ర హండ్లూమ్-టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ విడుదల చేసి ప్రశంసించారు.
- 2018లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సహకారంతో ''స్వచ్ఛ యాదాద్రి '' రూపకల్పన- మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య ప్రశంసించారు.
- 2018లో Temple City Of Telanganaగా యాదాద్రి భువనగిరి జిల్లా పై ప్రత్యేక డాక్యూమెంటరీ రూపకల్పన
- 2019 గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ''ఉత్తమ సామాజిక సేవా పురస్కారం'' యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అందించారు.
- 2019 ఏఫ్రిల్ లో భువనగిరి ఖిల్లా పర్యాటక అభివదికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా ''భువనగిరి దుర్గం'' డాక్యుమెంటరీ రూపకల్పన - మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య, భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరి కష్ణ ప్రశంసలు
- 2019 జూలైలో ప్రభుత్వ పాఠశాలల చదువు - గొప్పతనాన్ని ప్రజల్లో అవగాహన కల్పించుటకై నిర్మించిన ''అమ్మ ఒడి- అదే మన సర్కారు బడి'' చిత్ర ట్రైలర్ ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ వీక్షించి ప్రశంసించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ మల్లేషం చిత్ర దర్శక,నిర్మాత రాచకొండ రాజు, ప్రముఖ ఆర్ట్ దర్శకుడు ఏలె లక్ష్మణ్, సినీ కథా మాటల రచయిత పెద్దింటి అశోక్ కుమార్ విడుదల చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ుూఖీA తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డు-2019'' పోటీల్లో ఉత్తమ సామాజిక అవగాహన చిత్రంగా ''అమ్మ ఒడి- అదే మన సర్కారు బడి'' కి పురస్కారం లభించింది. విశ్వకవి గుర్రం జాషువా 124వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్, సుమధుర కళానికేతన్ సంయుక్తంగా నిర్వహించిన ''గుర్రం జాషువా తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డులు-2019'' లో ఉత్తమ సామాజిక లఘు చిత్రంగా అమ్మ ఒడి- అదే మన సర్కారు బడి ఉత్తమ సామాజిక అవగాహన లఘు చిత్రంగా ప్రత్యేక బహుమతి పురస్కారం అందుకుంది. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహ రావు చేతుల మీదగా పురస్కారం అందించారు.
- భువనగిరి దుర్గం డాక్యుమెంటరీ చిత్రానికి రెండు పురస్కారాలు.!
- ''నేను సైతం ప్రీమియర్ అవార్డ్స్-2020'' షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పోటీల్లో అడ్వెంచర్ ప్లేస్ ఆఫ్ తెలంగాణగా గుర్తింపు పొందిన భువనగిరి ఖిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ''భువనగిరి దుర్గం'' ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ దర్శకుడుగా అవార్డ్లు అందుకున్నాను.
- మంచి వినోదం, ప్రేమ, సామాజిక నేపథ్యంతో మరో సినిమా కథ పూర్తి చేశాను.
తమసోమా జ్యోతిర్గమయ చిత్ర కథ
తమసోమా జ్యోతిర్గమయ చిత్రాన్ని నిర్మాత తడక రమేష్ గారి సహకారంతో పూర్తిచేశాను. ప్రకతి సంపదను రంగులు గా వేసి సరి కొత్త చిత్రాలను ఆరు గజాల చీరలో పొందు పరిచే చేనేతకు... నానాటికీ పెరిగిపోతున్న ఆకలి చావులకు, వలస బతుకులకు ఇక చరమ గీతం పాడేలా కళ కి ఊపిరి పోసిన ఓ చేనేత కళాకారుడి కథే ఈ చిత్రం.. ఈ చిత్రం 2001 నుండి 2014 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో నిర్మించడం జరిగింది. రాష్ట్ర చేనేత, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చిత్ర ట్రైలర్ ని వీక్షించారు. సినిమా చూస్తానని హామీ ఇచ్చారు కానీ అంతలోనే కరోనాతో చిత్రం విడుదల కాలేదు. త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.
ప్రముఖ దర్శకులు వి.వి వినాయక్, ఎన్ శంకర్, వేణు ఉడుగుల, తరుణ్ భాస్కర్ చిత్రాన్ని వీక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నిర్మాతలు బెల్లంకొండ సురేష్ , బెక్కం వేణుగోపాల్, అభిషేక్ నామ, మధుర శ్రీధర్ రెడ్డి, నటులు ప్రియదర్శి, టీఎన్ఆర్, వెంకట్ సిద్దారెడ్డి వంటి ప్రముఖులు వీక్షించారు. ఈ సినిమాకు పెద్దింటి అశోక్ కుమార్ రాసిన 'నువ్వొక చలనం.. నువ్వొక జ్వలనం ఆపకు నీ పయనం' అంటూ సాగే ఈ పాట నిరుత్సాహం ఆవహించి ఉన్న వారి ఒక ఉత్తేజాన్ని, స్పూర్తిని కల్గిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీినటులందరు కొత్తవారే అందులోను పోచంపల్లి వాసులు కావటం విశేషం.