Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కౌగిలిలో ఎంత మహిముండేదో
ఆ కౌగిలింత ఎంతెంత మహత్తరమైనదో
గుండె బరువెక్కినపుడల్లా
రెక్కలు కట్టుకొని వచ్చి
ఒదిగిపోవాలనిపించేది
నీ రెండు చేతుల మధ్య
ఒక మైమరుపు
ఒక అపూర్వ ప్రశాంతత
నువ్వు నన్ను దగ్గరకు తీసుకొని
ఓదార్పుగా హత్తుకున్న ప్రతిసారీ
ఒక అనిర్వచనీయ హాయి
ఒక తెలియని తీయని అనుభూతి
నువ్వు రా రమ్మని చేయిపట్టి లాగి
ప్రేమగా ఆలింగనం చేసుకున్నప్పుడల్లా
నీకు తెలుసో లేదో
నిన్ను మరిచిపోలేనట్టే
నీ దేహపరిమళాన్నీ నేనింకా మర్చిపోలేదు
అమ్మపాలవాసనను పసివాడు మర్చిపోనట్టే!
- కార్తీక రాజు
సెల్: 8977336447