Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని చోట్లా
అగ్ని ఎగిసిపడుతోంది
వాయువు తోడై, ఉగ్రుడై
ధూళి భారీగా
మేఘాన్ని బ్రమించేలా
మహాక్రతువనిపించేలా
హౌమగుండాలని తలపించేలా
యాగమైతే కాదు
కాలుతున్నజి
శవాల మంటలు
కరోనా మతుల గుట్టలు
వందల్లో
వరుసల్లోజి
ఏక కాలంలో
దగ్దమైతున్న తీరు
ముక్కోటి దేవతలారా
దివి నుండి తిలకించి
హౌమాలని బ్రమించారేమో
వర్థిల్లాలని దీవించారేమో
మరణ మదంగం ఆగడం లేదు
ఒకసారి భువికేగండి
ఆరని చితి మంటలు చూడండి
ఆర్తనాదాలు, ఆక్రందనలు వినండి
కరోనా ముప్పును తొలగిచండి
అయినా... ఓ ఈశ్వరా
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
ఈ ఘోరకలి నీ ఆగ్రహమేనా
నీ నివాసం స్శశానమే కదా
పాశానమే కరిగే రోదనలు
కన్నీటీతో అభిషేకించినా.. నీ కోపం చల్లారదా
ఇకనైనా శాంతించు
మతదేహాల ప్రవాహాన్ని మోస్తున్న
గంగా మొరనైనా ఆలకించు
గరళాన్ని దాచినట్టు
కరోనానూ అరికట్టు
మానవాళికి బ్రతుకునివ్వు
- ఎం.విష్ణు ప్రసాద్