Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్లిక్‌లాగ్ ఇన్..భ(యు)వతకు భరోసా
నెలనెలా లక్షల రూపాయల జీతాలు.. వారాంతాల్లో సరదాలు... పాతికేళ్లకే పక్కవాళ్లు కుళ్లుకునే జీవితాలు... ఇది కాదు కదా జీవితమంటే అని భావించాడో కుర్రాడు.. అతడే ఇప్పుడు వెబ్సైట్లు, యాప్‌లు రూపొందిస్తూ ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. అవకాశం రావాలేగానీ విద్యార్హతతో సంబంధం లేకుండా సత్తా చూపే ఇలాంటి ప్రతిభావంతులు ఎందరో ఉంటారు. తనలాంటివాళ్లకు వెతికిమరీ ఉద్యోగాలిస్తున్నాడు హైదరాబాదీ. ఎప్పటికైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కలలుగన్న ఈ యువకుడు.. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కావాలంటే బీటెకో ఎంటెకో చదివి ఉండాలి. ఏ ఉద్యోగానికెళ్లినా ముందు ఎదురయ్యే ప్రశ్న ఏం చదివావు అనే. ఏదైనా కారణంతో డిగ్రీ పూర్తి చేయలేకపోతే ఎంత ప్రతిభావంతుడికైనా ఉద్యోగం రావడం గగనమే. ఈ ట్రెండ్‌ని బద్ధలు కొట్టాడు. తానేంటో నిరూపించుకుంటున్న 'క్లిక్‌లాగ్' వ్యవస్థాపకుడు సంతోష్ సక్సెస్ స్టోరీ ఈ వారం జోష్...
బాలారిష్టాలు దాటి
క్లిక్‌లాగ్ ఓ స్టార్టప్ కంపెనీ. ఎన్నో బాలారిష్టాలు దాటి దూసుకెళ్తున్న అంకుర సంస్థ. వెబ్ డిజైన్, డెవలప్మెంట్, యాప్స్ తయారు చేయడం, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ రూపొందించడం, కంపెనీలకు బ్రాండింగ్.. ఇలా ఎన్నో చేస్తోంది. ఆ సంస్థను ఈ స్థాయికి చేర్చడానికి సంతోష్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నిజానికి తను చదివింది సైన్స్ డిగ్రీ. కానీ చిన్నప్పట్నుంచి కంప్యూటర్ అంటే ఇష్టం. సొంతంగా కోడింగ్ రాసేవాడు. 'ఎప్పటికైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనిపించుకోవాలి' అని తహతహలాడేవాడు. అదే ఉత్సాహంతో కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లాడు. 'సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎలా అవుదామనుకుంటున్నావ్?' అనేవాళ్లు. సీవీ చూడగానే వెళ్లిపొమ్మనేవారు. ఎవరూ తన ఆసక్తి, ప్రతిభను గుర్తించేవారు కాదు. ఇక లాభం లేదనుకొని సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించి తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. కానీ ఆర్థికంగా అంత స్థితిమంతుడేం కాదు. కజిన్ సహాకారంతో చిన్న గదిలో ఒక్కడితో మొదలైన సంస్థ రెండేళ్లలో పెద్దపెద్ద కస్టమర్లున్న కంపెనీగా ఎదిగింది. తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు వేరొకరికి ఎదురుకావొద్దనే ఉద్దేశంతో ప్రతిభ ఉన్నవారిని విద్యార్హతతో సంబంధం లేకుండా ప్రోత్సహిస్తున్నాడు.
వారికే అవకాశం
అడుగడుగునా అనుమానాలు.. క్లిక్‌లాగ్ లాక్‌డౌన్‌కి ముందు మొదలైంది. 'ఐటీ కంపెనీనా?', 'నీకేం అనుభవం ఉంది?', కరోనా సమయంలో కొత్త స్టార్టప్ సక్సెస్ కాదేమో? ఇలాంటి మాటలెన్నో విన్నాడు. అయినా ముందుకెళ్లాడు. ఆకట్టుకునేలా చెప్పడం, చెప్పింది చేసి చూపించడంతో త్వరలోనే కంపెనీల నమ్మకం సంపాదించాడు. దీంతోపాటు కొందరు సెలెబ్రెటీలకు పేజీలు రూపొందించి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఆహా, వీఐయూ, హాట్‌స్టార్ ఛానెళ్లలో వచ్చే వెబ్‌సిరీస్‌లకు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, ప్రోడక్ట్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్.. కార్యక్రమాలు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. 'నేను సజనాత్మకత ఉన్న ఉద్యోగులనే ఎంచుకుంటా. నా కంపెనీ, నా పని అనుకునే వాళ్లనే ప్రోత్సహిస్తా. వాళ్లకి సబ్జెక్టు ఉంటే చాలు' అని తన విజయ రహస్యం చెబుతాడు సంతోష్.
గూగుల్ పాఠశాల.. యూట్యూబే గురువు
బీటెక్ అయిపోగానే చాలామంది అప్పులు చేసి, లక్షల ఫీజులు చెల్లించి సాఫ్ట్వేర్, ఇతర కోర్సుల్లో చేరతారు. నేను వీఎఫ్ఎక్స్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఫీజులు భరించే పరిస్థితిలో లేను. అప్పుడే గూగుల్‌ని ఆశ్రయించా. యూట్యూబ్‌నే గురువుగా భావించా. వీడియోలు చూసే వీఎఫ్ఎక్స్పై పట్టు సాధించా. అదొక్కటే కాదు.. యాప్, లోగో డిజైనింగ్, బ్రోచర్ డిజైనింగ్, బ్రాండింగ్, యూఐ, 2డీ, త్రీడీ యానిమేషన్, ఎస్ఈవో, డిజిటల్ మార్కెటింగ్, ఎడిటింగ్.. ఇలా ప్రతీదీ ఆన్లైన్లో చూసే నేర్చుకున్నాను. పెద్దపెద్ద ఇనిస్టిట్యూట్లలో భారీగా ఫీజులు కట్టి కోర్సులు పూర్తి చేసినవాళ్లు సైతం నా దగ్గరికొచ్చి నేర్చుకునేవాళ్లు. నేను చెప్పేదేంటంటే అంతర్జాలంలోనే అపారమైన సమాచారం ఉంది. ఆసక్తి, పట్టుదల ఉంటే దాన్నే గురువుగా ఎంచుకోవచ్చు.
ఉపాధి కల్పన
బేవెబ్ డిజైనింగ్, యాప్స్ తయారీ, కోడింగ్ రాయడం.. వీటిలో ప్రతిభ ఉంటే చాలు. ఇంటర్వ్యూకి పిలుస్తాడు. ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేకపోయారో ఆరా తీస్తాడు. చివరగా వాళ్లకో టాస్క్ ఇస్తాడు. అభ్యర్థి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు? దాన్ని ఎలా ముగించాడు? అని పరిశీలించి సత్తా ఉంటే ఉద్యోగంలోకి తీసుకుంటాడు. ఇతర సంస్థలకు రికమెండ్ చేస్తాడు. క్లిక్ లాగ్ సొల్యూషన్ ప్రయివేట్ లిమిటెడ్ గురించి సంతోష్ మాటల్లోనే తెలుసుకుందాం. 'ప్రతీ స్టార్టప్ కంపెనీలకు, మీడియం రేంజ్ బిజెనెస్ కు డిజిటల్ సర్వీస్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా కంపెనీలు డిజిటల్ కు షిఫ్ట్ అయ్యాయి. ఈ కోవిడ్ వల్ల డిజిటల్ చాలా ఇంప్రూవ్ కూడా అయ్యింది. స్టార్టప్ కంపెనీస్ కాని అవుట్ అన్ గోయింగ్ కంపేనీస్ కానీ వాళ్లకు కావల్సిన అప్ డెట్స్ తో సహా డిజిటల్ చేయాలి. కాబట్టి వాళ్లకు సంబందించినవన్ని డిజిటల్ వర్క్స్ అన్ని వన్ స్టాప్ సోల్యుషన్ లోనే జరుగుతాయి. ఆ కంపెనీకి గ్రోత్ ఎలా..? ఆ కంపెనీకి ఎలా చేస్తే ఫండ్స్ వస్తాయి..? బిజినెస్ ఎలా చేయాలి, క్లైంట్స్ ను ఎలా తీసుకురావాలి , వాళ్లను ఎలా డీల్ చేయాలి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి.. ఆ లీడ్ జనరేషన్ ఎలా క్లోజ్ చేయాలి.. కావల్సిన టీమ్ సైజ్ ఎంత కావాలి.. వాళ్లకు ఎలాంటి కలర్స్ వాడాలి.. వాళ్ల బ్రాండింగ్ ఒకటి క్రియేట్ చేయాలి.. వాళ్లకు ప్రమోషన్ ఎలా చేయాలి .. ఎలా మార్కెటింగ్ చేయాలి, వాళ్ల ప్రాడక్ట్ ను ఎక్స్ ప్లెయిన్ చేయాలి.. క్వాలిటి చెక్ చేయాలి, ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఇలాంటివన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మా కంపెనీ సహకరిస్తుంది. అందు కోసం చాలా ప్యాకేజీలు పెట్టి మంచి బెస్ట్ ప్రైస్ లో రన్ చేస్తున్నాము. అలా చాలా మందికి స్టార్టప్ కంపెనీలకు, ఐడియస్ ఉన్న వాళ్లకి ఫండ్స్ ఉన్న ఎలా స్టార్ట్ చేయాలి.. ఫ్రాఫిట్ వస్తుందా..? వాళ్ల మైండ్ లో ఇవన్ని ఉంటాయి. అలాంటి వాళ్లు నన్ను ఒక్కసారి కలిస్తే నేను మంచి ఉపయోగకరమైన సలహాలు ఇవ్వగలను. బిజినెస్ అంత సులువు కాదు కానీ ఒక్కసారి సరిగ్గా అర్దం చేసుకుంటే దానంత సులువు ఇంకోటి ఉండదు.
ఒక బిజెనెస్ స్టార్ట్ చేస్తే దానికి కావల్సిన కస్టమర్స్ ఎవరు, లీడ్స్ ఎవరు, దానికి కావాల్సిన ఉద్యోగులు ఎంటి ఎంతమంది ఉండాలి, మినిమమ్ ఎంత ఇన్వెస్ట్ మెంట్ అవుతుంది. ఎంత పెడితే ఎంత వస్తుంది. దిన్ని రిటన్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అంటారు. ఆ వర్క్ ఎక్కడ అయితే ఫర్ ఫేక్ట్ అవుతుందో అక్కడ మన బిజినెస్ సక్సెస్ అయినట్టే. చాలా మంది కొవిడ్ టైమ్ లో బిజినెస్ ఎంటి అని అడిగారు. అందరు బిజినెస్ ను ఆపేస్తారు. కానీ, సంక్షోభ సమయాన్ని నేను ఒక అవకాశంగా మల్చుకుంటాను అనే నమ్మకంతో అడుగు ముందుకు వేశాను. అది నిజమో కాదో తెలిదు కానీ మా కంపెనీ బెస్ట్‌గానే నడుస్తుంది. మీరు ఫర్పెక్ట్గా చేయాలనకుంటే మీకు ఏ క్వాలీఫీకేషన్ అవసరం లేదు. మీకు స్కీల్ ఉంటే చాలు. మీ కేరీర్ కి కావాల్సినవి ఎవైతే ఉన్నాయో వాటిని ముందే మీరు గ్రాబ్ చేసుకుని వాటిమీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీ లైఫ్ బాగుంటది. నేనే ఉద్యోగాలు ఇచ్చేవారికి కూడా ఎలా ఇస్తున్నానంటే వాళ్ల క్వాలిఫికేషన్, మెరిట్ పర్సంటేజ్ చూసి ఇవ్వట్లేదు. అతను మన దానికి సెట్ అవుతాడా..?లేడా..? అతనికి నేను చెప్పిన పాయింట్స్ అర్దం అవుతున్నాయా..? లేదా..? ఫ్యూచర్ లో అతని బిహేవీయర్ ఎలా ఉండబోతుంది. అతని బాడీ లాగ్వేజ్ ఎలా ఉంది. ఇవి మాత్రమే చూస్తాను. ఎవరికైన ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. (మెయిల్ ఐడి). ఏ దేశంలో ఉన్నా.. ఎక్కడనుంచి అయినా సరే వాళ్లకు కోంచెం ఇంట్రెస్ట్ ఉంటే మా సర్వీసేస్ లో (వెబ్ సైట్) వాళ్లకు చిన్న ఇన్సేంటివ్ బేస్ జాబ్ ఇవ్వగలుగుతాను. వాళ్లకు ప్రాజెక్ట్ తీసుకువచ్చినందుకు పర్సంటేజ్ ఇచ్చేలాగా ఇన్సేంటివ్ బేస్ బిజినెస్ ఇవ్వగలుగుతాను. దాని వల్ల మీరు చాలా సంపాదించవచ్చు కూడా. మాకు జాడి.ఇన్ అని ఆన్ లైన్ పికిల్స్ సెల్ బిజినెస్ కూడా ఉంది. దాన్ని ఇంకా హై రేంజ్ లో చేయాలి ఆలోచన ఉంది. ప్రపంచంలో ఎక్కడ నుంచైన మా ప్రాడక్ట్స్ తీసుకోవచ్చు. చాలా జెన్యూన్ గా చేస్తున్నాను ఇది. ఇందులో ఎలాంటి ప్రాఫిట్స్ ఎక్స్ పెక్ట్ చేయట్లేదు. క్లోస్ మై బుక్ అని ఇంకో బిజినెస్ ఇంకోక స్టార్టప్ ఐడియా ఉంది. ఆన్ లైన్ టీచింగ్ ప్లాట్ ఫాం ఇప్పటికే చాలా ఉన్నాయి నేను యూనిక్ గా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నా నమ్మకం. దాన్ని కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేసి మంచి కాన్సెప్ట్ తీసుకువస్తాను. ఇంకా నా దగ్గర చాలా చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. నాకు ఎవరైనా ఫండింగ్ ఇచ్చే వారు దొరికితే ఇంకా బాగా ఉపయోగపడేలా చేస్తాను. పూచర్ లో నేను ఖచ్చితంగా చాలా మందికి ఉద్యోగాలు ఆఫర్ చేస్తాను. అదే నా మెయిన్ గోల్. వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే నేను మంచి ప్రాడక్ట్ ను మా దాంట్లో నుంచి యాప్ గాని మంచి ఈ కామర్స్ ప్లాట్ ఫాం గాని ఖచ్చితంగా లాంచ్ చేస్తాము. ప్రాడక్ట్, కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి యాప్స్ చేస్తే ఫ్యూచర్ లో టెక్నాలజికి ఉపయోగపడుతుంది. స్విగ్గీ, ఓలా ఇలాంటి యాప్స్ నాకు చాలా ఇష్టం. వాళ్లకు సొంత కార్లుక లేవు,సొంత హౌటల్స్ లేవు, సొంత రెస్టారెంట్లు లేవు కాని వాళ్లు ఈ డిజిటల్ ప్లాట్ ఫాంని వాడుకుని ఇప్పటికి బాగా సంపాదిస్తున్నారు.
అతి కొద్దిరోజుల్లోనే మా బిజినెస్ ఐడియాలను ఒక్కోక్కటి మెల్లగా మార్కెట్ లోకి తీసుకువస్తాం. ప్యూచర్ లో చాలా ప్రాడక్ట్స్ అయితే ఉన్నాయి. మా ఓన్ యాప్స్ చేయాలని ఉంది. అవి చాలా మందికి యూజ్ అయ్యే విధంగా , ప్యూచర్ ఉండేలాగా వాటిని యూజ్ చేయాలని ఉంది. ఖచ్చితంగా వాటిని కూడా తీసుకువస్తాను. తొందర్లోనే వాటిని తీసుకువచ్చి మీ అందరి ముందు పెడుతాను.' విదేశాల్లో కూడా త్వరలో మా కంపెనీని ప్రారంభిస్తాము అని తన కంపెనీ అందిస్తున్న సర్వీసుల గురించి తెలియజేశారు.