Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతరమా !
నిదురించావా ??
మేల్కొనలేదా !?
చీకటి తెరలలో ...
కూరుకుపోయి,
మౌన దీన గానాలు ఆలపిస్తున్నావా?
నెత్తుటి సత్తువ ను...
నిర్వీర్యం చేస్తూ, ఉలుకు పలుకు లేక ...
అక్కడే ఆగిపోయావా ??
ఎదిరించి ప్రశ్నించక...
బ్రతికే స్వేచ్ఛను కోల్పోయావా ??
ఏకాంతంలో ఏడుస్తూ...
కలలను కన్నీళ్ళుగా మారుస్తూ
బాధల కొలిమిలో కాలి, వేదన పడుతూ ,కాలం గడుపుతూ, భారమైన బ్రతుకును చేరదీస్తున్నావా ??
ఒత్తిడితో ఒంటరివై, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావా?
నీ హక్కులకై ధిక్కరించక,
అడుగులు వెనక్కి వేస్తున్నావా !?
నువ్వు నవ యుగపు చైతన్యానివి!
మరవకు నీ కర్తవ్యాన్ని.
ఇక నిసత్తువను చీల్చెరు
మౌనాన్ని బద్దలు చెరు
నీ స్వేచ్ఛకై పోరాడు
నిరంకుశత్వాన్ని పారద్రోలు
చస్తే ఒకేసారి ...
పదే పదే చావడం ఎందుకు? సాహసించు ...
నిద్రించుకు నేస్తమా
గుండె ధైర్యంతో ముందుకెళ్ళి
నీ కలలను నిజం చెరు
నవ చైతన్యానికి నాంది పలికి కర్తవ్యం తో ముందుకు అడుగు వేస్తూ...
మేలుకో
రేపటి తరాన్ని
బతికించేందుకు.
- సహని, మహబూబ్నగర్