Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరాల్లో
ఇంకా సిరా తడి ఆరలేదు
ఆమె గురించి
రాస్తున్నందుకు కాబోలు.
అశ్రుగీతమా ఇది?
ఆక్రోశ గీతం అంతకన్నా కాదు!
ఆవేదన నిండిన
నయన జలపాతం.
అవనిపై ఉన్న మూడొంతుల నీరు
ఆమె కనుదోయి నుంచే వచ్చిందేమో!
అందుకే అంతరంగం
సముద్రమంత లోతు.
ఆకాశమంత ఉన్నతమైన మనస్సును
అందుకోవాలంటే నిచ్చన కాదు
అనురాగాల రెక్కలు కావాలి.
అనునిత్యం దహిస్తున్న దేహాన్ని మోస్తున్నదామె
అందుకే ఆమె సహనానికి నేలమ్మే హద్దు.
అపురూపమైన ఆమె మనోధైర్యానికి
గాలి అచ్చెరువొందింది.
అవమానాల అగ్నికీలలలో ఎగదోసినా
ఆమె పవిత్రతకు నివ్వెరబోయింది నిప్పు.
ఇది అంతం లేని నవరసాల ప్రకతి
అట్టి వారికి కీడు చేస్తే లేదు నిష్కతి.
- కుడికాల వంశీధర్