Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం...
సర్ఫరోశీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై
దేఖ్నా హై జోర్ కితనా బాజూ-ఎ-ఖాతిల్ మే హై
శౌఖ్ సే రాV్‌ా-ఎ-మొహబ్బత్ కీ ముసీబత్ ఝేల్ లే
ఇక్ ఖుషీ కా రాజ్ ఫిన్హా జాదా-ఎ-మంజిల్ మే హై
మర్నేవాలోం ఆవో అబ్ గర్దన్ కటావో శౌక్ సే
యే ఘనీమత్ వఖ్త్ హై ఖంజర్ ఖఫ్-ఎ-ఖాతిల్ మే హై
వఖ్త్ ఆనే దే దిఖా దేంగే తుఝే ఐ ఆస్మాఉ
హమ్ అభీ సే క్యూ బతాయే క్యా హమారే దిల్ మే హై
అబ్ న అగ్లే వల్వలే హై ఔర్ న ఓ అర్మా కీ భీడ్
సిర్ఫ్ మిట్ జానే కీ ఎక్ హస్రత్ దిల్-ఎ-బిస్మిల్ మే హై
అనువాదం...
తిరుగుబాటు చేయాలనే కోరికొకటి మా గుండెలోన ఉన్నది
మరి చూడాలి, అణచివేసే వాని కండలో దమ్ము ఎంత ఉన్నది
ఉత్సాహంతో ప్రేమ మార్గంలో ఎదురయ్యే కష్టాలను ఓర్చుకో
సంతోషపు మర్మం అన్నది గమ్యం చేరే దారిలోనే దాగి ఉన్నది
చనిపోవాలన్ఱే వారు రారండీ, మీ మెడలను వేరు చేయించుకోండి
ఇదే సరైన సమయం, ఖడ్గమిప్పుడు హంతకుని చేతుల్లో ఉంది.
సమయాన్ని రానివ్వు చూపించి తీరుతాం నీకు, ఓ ఆకాశమా!
నీకిప్పుడే మేమెందుకు చెప్పాలి, మా అందరి గుండెల్లో దాగున్నది
ఇప్పుడు ఆ ఉత్సాహమూ లేదు, ఆ ఆశల సమూహమూ లేదు
కేవలం చనిపోవాలనే తీరని కోరిక బిస్మిల్ హదయంలో ఉన్నది.
పాట్నా కవులలో పేరెన్నికగన్న కవి, స్వాతంత్ర సమర యోధుడు, బిస్మిల్ అజీమాబాదీ అసలు పేరు సయ్యద్ షా మొహమ్మద్ హసన్. జమీందారీ కుటుంబానికి చెందిన ఆయన, 1901 బిహార్ రాష్ట్రం లోని అజీమాబాద్ లో జన్మించాడు. న్యాయవాది అయిన తండ్రి సయ్యద్ షాV్‌ా ఆలే హసన్, తన చిన్నతనంలోనే మరణించాడు. ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, ఇంగ్లిష్ భాషల్లో బిస్మిల్ మంచి నైపుణ్యం కలవాడు. తన తాతయ్య షాV్‌ా ముబారక్ కక్వీ అజీమాబాదీ, మేనమామ 'ఖాన్ బహద్దూర్' షాV్‌ా ముహియుద్దీన్ ఇద్దరు స్వయంగా కవులవ్వడం వలన బిస్మిల్ పెరిగిన వాతావరణం ఎప్పుడూ షేరో షాయారీ ఇంకా సాహిత్య విషయాలతోనే నిండి ఉండేది. ఆ వాతావరణంలోనే బిస్మిల్ ఉర్దూ కవిత్వం పైన మక్కువ పెంచుకోవడమే కాకుండా పాట్నాలోని కుతుబ్ ఖానా అంజుమన్ తరఖీ ఉర్దూ గ్రంథాలయానికి తరచూ వెళ్ళి సాహిత్య అధ్యయనం చేసేవాడు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ జాతీయ వాదాన్ని బలపరిచిన బిస్మిల్ 1920 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో పాలు పంచుకున్నాడు. ఇక్బాల్ సంపాదక సహకారాలతో రాసిన కలామ్-ఇ-బిస్మిల్, చమనిస్తాన్-ఎ-బిస్మిల్ అలాగే తన జ్ఞాపకాల ఆధారంగా రాసిన యారన్-ఇ-మైఖదహ్ (1976) మొదలైనవి బిస్మిల్ రచనలు. చాలా వరకు బిస్మిల్ సాహిత్య కతులు చెల్లాచెదురయ్యాయి. మిగిలిన వాటిని ఖుదా బఖ్శ్ ఓరియెంటల్ లైబ్రరీ వారు సంగ్రహించి హికాయత్-ఎ-హస్తీ అనే శీర్షికతో ప్రచురించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో లైబ్రరీ, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, ఢిల్లీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ సిస్టమ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలయాలు తమ కాటలాగ్ జాబితాలలో బిస్మిల్ రచనలను పొందుపరిచారు. ద లండన్ మాగజైన్ మొదలైన అంతర్జాతీయ మాగజైన్లు, జర్నల్‌లు ఆయన రచనలను కోట్ చేసాయి. బీహార్ ఉర్దూ అకాడమీ తను చేసిన సాహిత్య కషికి స్మారకంగా బిస్మిల్ అజీమాబాదీ అవార్డుని అందజేస్తుంది. 1978 జూన్ 20న అజీమాబాద్‌లో బిస్మిల్ మరణించగా, తన అంతిమ సంస్కారాలను బిహార్ లోని కుర్తా అనే గ్రామంలో జరిగాయి.
గజల్ కేవలం విరహవేదననే కాదు సమాజ వేదనను కూడా తనలో ప్రతిబింబిం చుకుంది. వాస్తవానికి గజల్ కాలాన్ని అర్థం చేసుకుంటూ, దానికి అనుగుణంగా ముందుకు సాగింది. సామాన్య ప్రజల దుఃఖాన్ని, లోకం లోని విచారాలనూ విషాదాలనూ ఎప్పటి కప్పుడు ఎక్కడికక్కడ తనలో ముద్రించుకో సాగింది. 1857-1947 వరకు సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్య పరచడంలో గజల్ పోషించిన పాత్ర చారి త్రాత్మక మైనది. గజల్ సరికొత్తగా విప్లవావతా రాన్ని ధరించి, ప్రతీ భారతీయుడి గుండెలో దేశభక్తిని నింపి చైతన్య జ్వాలల్ని రగిలించింది. ఆంగ్లేయుల అధికారాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎందరో కవుల నోళ్ళ నుండి వందల షేర్లను సంధించింది. ఈ కాలమ్ లో తీసుకున్న ''సర్ఫరోశీ కీ తమన్నా..'' గజల్ ఉద్యమకాలంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. బిస్మిల్ దీనిని జలియన్‌వాలాబాగ్ మారణ హౌమం వంటి ఎన్నో అమానవీయ చర్యలను ప్రతిఘటిస్తూ రాసాడు. 11 షేర్లు గల ఈ గజల్ మొట్టమొదట ఢిల్లీలోని 'సబాV్‌ా' అనే జర్నల్ లో ప్రచురించబడింది. అయితే ఈ గజల్ గురించి ఒక సంశయం ఉండేది. కొందరు ఈ గజల్ ని బిస్మిల్ కలం పేరుగా పెట్టుకున్న రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే మరో కవి రాసాడని అనేవారు. కానీ ఇద్దరు కవుల పుట్టుపూర్వోత్తరాల ప్రకారం చూస్తే, రామ్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. అతను బిస్మిల్, రామ్, అగ్యాత్ వంటి నామముద్రికలను కూడా ఉపయోగించాడాని తెలుస్తోంది. కానీ బిహార్ లోని అజీమాబాద్కి చెందిన బిస్మిల్ మాత్రం ఒకటే నామముద్రిక ఉపయోగించాడు. కాబట్టే తఖల్లుస్ లో అజీమాబాదీ అని ఉంది. ఖుదా బఖ్శ్ ఓరియెంటల్ లైబ్రరీ వారికి బిస్మిల్ డైరీలోని ఒక పేజ్ లో ఈ గజల్ ఒరిజినల్ కాపీ దొరికింది. అందులో తన కవిత్వ గురువైన షాద్ అజీమాబాదీ ఈ గజల్ లోని తప్పులను సరిదిద్దినట్టుగా ఆధారాలున్నాయి. దీన్నిబట్టి ఈ గజల్ బిస్మిల్ అజీమాబాదీయే రాసాడని నిరూపించబడింది. ఈ గజల్ స్వాతంత్య్రానంతరం వచ్చిన షాహీద్ (1965), సర్ఫరోశ్ (1999), ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), రంగ్ దే బసంతి (2006), గులాల్ (2009) వంటి ఎన్నో దేశభక్తి చలనచిత్రాలలో అలరించింది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
సెల్: 9441002256