Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫొటోగ్రఫీ. జ్ఞాపకాల దొంతర్లను చిరస్థాయిగా నిలిపే ఛాయాచిత్రం.. జీవిత కాలానికి సరిపడా స్మతులను మన లైబ్రరీలో చేరుస్తుంది. పండగలు, వేడుకలు, ఆనందాలు, విజయాలు, విషాదాలు, పరిణామక్రమం, దేశాల మధ్య ఒప్పందాలు, యుద్ధాలు, ప్రకతి సోయగాలు, జంతుజాలం, పశుపక్ష్యాదులు.. ఇలా ఎన్నో అపురూపమైన, విశిష్ట సంఘటనలను యాదికి తెచ్చే కెమెరా పనితనం ఫొటోగ్రఫీ. వర్తమానానికి భవిష్యత్తులో సాక్ష్యంగా నిలుస్తున్న ఫొటోగ్రఫీ యువతకు చక్కటి ఉపాధి వేదికగా మారుతోంది. సంప్రదాయ వివాహాలు, ఈవెంట్ దశలు దాటి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో అవకాశాలకు భరోసాగా నిలుస్తున్న ''ఫొటోగ్రఫీ'' ని తన కెరీర్‌గా ఎంచుకొన్న ఇందూరు యువకుడు 'తిరుపతి' పరిచయ కథనం ఈ వారం నవతెలంగాణ 'జోష్
స్మైల్ ప్లీజ్... కాస్త నవ్వండి... అంటూ తమ ఏకాగ్రతను మన ముఖాల మీద నిలిపి మనల్ని అందంగా చూపించడానికి వాళ్ళు అపసోపాలు పడుతుంటారు! ఫోటోలు తీయడమంటే.. దశ్యాలు చిత్రీకరించడమంటే...అది ఓ అందమైన కళ ! నాలుగ్గోడల మధ్య చిత్రీకరించినా, ఆరు బయట అందరి మధ్య చిత్రీకరించినా... అర్జునుడి గురి పక్షి కన్నుపై పెట్టినట్టు తమ దష్టంతా ఆబ్జెక్టుపైనే అతికిస్తారు!
శుభాశుభకార్యాల్లో చిత్రీకరణకు సరాసరి సర్కస్ ఫీట్స్ చేస్తారు. కార్యక్రమం ప్రారంభం నుండి పూర్తయినంతవరకు బాధ్యతను మెడలో వేలాడదీసి భుజం మీద బరువుగా మోసి అనేక ప్రదక్షిణాలు చేస్తూనే వుంటారు ! ఉద్యమాలను, ఆందోళనలను చిత్రీకరించినప్పుడు లాఠీల మధ్య, తూటాల మధ్య ప్రాణాలను పణంగా పెడతారు ! సామాజిక బతుకు చిత్రాలను చిత్రీకరించి మానవతా వాదులుగా మరో అవతారం ఎత్తుతారు ! జాతరలు, తీర్ధయాత్రలు మోహాలు, సమ్మోహనాలు సభలు, సమావేశాలు ఆటలు, పాటలు ఉత్సవాలు, వేడుకలు అన్నీ వారి కెమెరా నేత్రంలో చిత్రంగా ఒదిగిపోయి.. కదిలే చిత్రాలుగా కనువిందు చేస్తాయి ! వర్తమానంలో వారు తీసిన చిత్రాలు చరిత్ర పుటల్లోకి జారిపోయి భావితరాలవారికి సాక్ష్యాలౌతాయి! వ్యక్తిగతంగా వారు తీసిన చిత్రాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయి వారసత్వానికి ప్రతినిధులుగా ముచ్చటగొల్పుతాయి ! చిత్రాలు, దశ్యాలతో మనల్ని అలరించిన ఈ అపురూప కళాకారులు అదశ్య రూపాలుగా తెరవెనుకే మిగిలిపోయినా చెక్కు చెదరని రూపాలుగా మన మనస్సులో మెదులుతూనే ఉంటారు !
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ
ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే తెలియని వారు ఉండరు. పెండ్లి,రిసెప్షన్, ఎంగేజ్మెంట్ ఇలా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఫోటోగ్రఫి లేనిదే జరగట్లేదు. అంతలా మన జీవితాల్లో ఫోటోగ్రఫీ ఒక భాగమైపోయింది. ఎంతో అనుభవం ఉన్న ఫోటోగ్రాఫర్లతో పాటు యువ ఫోటోగ్రాఫర్ లు కూడా రాణిస్తున్నారు. ఫ్యాషన్ తో ఈ రంగం వైపు అడుగులు వేసిన యువకులు.. తరువాత తమ కేరీర్ గా మార్చుకుంటున్నారు. ఇలాంటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీని తన కెరీర్‌గా మలచుకుని రాణిస్తున్న యువకుడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన 'తిరుపతి'. తండ్రి 'సాయిబాబా' ఆర్టీసీ డ్రైవర్, తల్లి మణెమ్మ, అక్క సంధ్య, తమ్ముడు సాయి కిరణ్.
డిప్లమాలో ఉండగానే ఫోటోగ్రఫీ పై ఆసక్తి కలగడంతో అప్పటి నుండే తన ప్రయత్నాలు ప్రారంభించిన తిరుపతి ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్‌కు రావడం అతని జీవితంలో ఒక మలుపు. మల్లారెడ్డి కాలేజిలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తన మిత్రుడు, రచయిత, దర్శకుడు హేమంత్ సహకారంతో తొలిసారి కెమెరా కొనుక్కున్నాడు. ఆ క్షణాలు తనకు ఎంతో మధురమైనవి అంటాడు తిరుపతి. అలా తొలిసారి ఈ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టాడు. షార్ట్ ఫిల్మీస్ తీస్తూ, ఫోటోగ్రఫీ క్లాసులకు హజరవుతూ సవ్యసాచిలా రెండింటిని ఏకకాలంలో పూర్తి చేశాడు. అతి తక్కువ కాలంలో సుధాకర్ కూడేలి దగ్గర కెమెరాకి సంబంధించిన మెళకువలు నేర్చుకుని తను చదివిన 'మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ' ఈవెంట్స్‌కి ఫోటోగ్రఫీ చెయ్యడం మొదలు పెట్టాడు. అలా హాబీ లాగా మొదలు పెట్టిన ఫోటోగ్రఫీ నేడు తన అభిరుచిని తీర్చడంతో పాటు మరెందరికో ఉపాధిని కల్పిస్తుంది. అమ్మానాన్న ఇచ్చిన పాకెట్ మనీ పోగుచేస్తూ, చిన్నచిన్న ఈవెంట్లు చేస్తూ ఆ వచ్చిన డబ్బులను దూబరా చేయకుండా కెమెరా, ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసి తన చదువు అయ్యే సరికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా మారాడు. ఇంజనీరింగ్ తర్వాత ప్రముఖమైన డి.ఎల్.ఎఫ్ కంపెనీలో జాబ్ సాధించి తండ్రి కల తీర్చాడు. కొడుకు చక్కగా చదువుకోకుండా ఇలా చేస్తున్నాడు అని దిగులు పడిన తండ్రి మమకారం.. నేడు ప్రయోజకుడైన కొడుకును చూసి ఆనంద భరితుడవుతున్నాడు.
Shooters Spot
ఈ ఫోటోగ్రఫి ప్రయాణంలో పరిచయమైనా 'కోడె మార్కండేయులు' (ఎన్ఆర్ఐ) ప్రోత్సాహంతో 'Shooters Spot' అనే ఒక చిన్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీని మొదలు పెట్టి తెలంగాణాలో ఉన్న అన్ని జిల్లాలో జరిగే శుభకార్యాలకి వెళ్లి ఫోటోలు తీయడం మొదలు పెట్టి అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించి హైదరాబాద్‌లో వందకు పైగా పెండ్లి ఈవెంట్స్ చెయ్యడం దానితో పాటు తెలుగు ఫిలిం, టీవీ ఇండిస్టీలో కొంత మంది సెలబ్రిటీలుకు ఫర్సనల్ ఫోటోగ్రఫర్ కూడా పనిచేస్తున్నారు. వారి కెమెరా పనితనంతో యాంకర్ రవి, విష్ణు ప్రియా, వర్షిణి, యాంకర్ ఇందు, తీన్మార్ సావిత్రి, హిమజ, రవి కిషన్, దీప్తి సునైనా లాంటి వాళ్ళను మెప్పించి వారి ప్రయివేటు ఫోటో షూట్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఒక వైపు జాబ్ చేస్తూ మరో వైపు ఫోటోగ్రఫి చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాధ్యమాల్లో 'తిరూ'స్ ఫోటోగ్రఫీ అంటే తెలియనివారు ఉండరు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కి 70వేలకు పైగ ఫాలోయర్స్ ఉండటం సాధారణ విషయం కాదు. దానితో పాటు ఇంస్టాగ్రామ్ వీడియోల్లో ఒక్కో వీడియోకి పది లక్షలకు పైబడి వ్యూవర్స్ ఉన్నారు.
వచ్చిన సంపాదనతో ఒక ఆఫీస్ కూడా పెట్టి 12మందికి ప్రతేక్ష్యంగాను, మరో 8మందికి పరోక్షంగా ఉపాధి కలిపిస్తున్నాడు. హౌటల్ మేనేజ్ మెంట్ చదివిన తన తమ్ముడు 'సాయి కిరణ్ ' దుబారు లో చేస్తున్న ఉద్యోగాన్ని వొదిలేసి అన్నకి బిజినెస్ డెవలప్మెంట్లో సహాయం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న టాప్ డ్రోన్ ఆపరేటర్లలో ఒకడైన సాయి 'కెప్టెన్ సాయి కిరణ్' అనే పేరు తో తనదైన ముద్ర వేసుకున్నాడు. అతను చేసిన నిజామాబాద్ డ్రోన్ వీడియో నిజామాబాద్ పట్టణానికి సంభందించిన తొలి డ్రోన్ వీడియోగా వైరల్ అయ్యింది.
Shooters Spot టీం: తిరుపతి,
కెప్టెన్ సాయి కిరణ్ (డ్రోన్)
మనీషా అబ్బిన (బేజి ఫోటోగ్రఫర్)
నవీన్ అడిచెర్ల (డిజిటల్ మార్కెటింగ్), తేజశ్రీ (హెచ్ ఆర్), ప్రవీణ్ బూసాని
తెలంగాణలో ఇప్పుడున్న ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోShooters Spot Pvt Ltd ది ఒక ప్రత్యేక స్థానం. ఫొటో గ్రాఫర్‌గా రాణించా డానికి స్వతహాగా సజనాత్మకత, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల పరిజ్ఞానం కల్గి ఉండటం. కెమెరా పనితీరులో ముఖ్యమైన లైటింగ్, షేప్స్ ప్యాట్రన్స, కంటిచూపు, ఫొటోగ్రాఫిక్ దష్టి లాంటి నైపుణ్యాలు తెలిసినవారు. ఫొటోలను అందంగా చూపడంలో కీలక పాత్ర పోషించే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్, అపెక్చర్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉన్న టీం తిరుపతి అండ్ కో. ఫ్రీ వెడ్డింగ్ లో తన సత్తా చాటుకుంటూనే, బేబీ ఫోటోగ్రఫీలో సైతం రానిస్తుంది. బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సావాలను కవర్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో వీడియో సాంగ్స్, వీడియో ఎడిటింగ్ వంటి వాటితో అనే సేవలు అందిస్తున్నారు. భవిష్యత్‌లో బేబీ ఫోటో స్టూడియోను ప్రారంభించాలనే ఆకాంక్షతో ఉన్నాము.