Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెలుగును చిందే తెలుగు
మధువును చిలికే తెలుగు
తేటగీతిలా - ఊట చెలిమెలా
ఆటవెలదిలా - జీవ జలధిలా
ప్రవహించును నా తెలుగు
ప్రభవించును నా తెలుగు
వికాసం పెంచే తెలుగు
విజ్ఞానం పంచే తెలుగు
జోల పాటలా - పూల తోటలా
దివ్య మాటలా -భవ్య బాటలా
పరమ పదమై నా తెలుగు
పరిఢవిల్లును నా తెలుగు
మమతను పంచే తెలుగు
మానవతను పెంచే తెలుగు
వీణ మీటలా జ్ఞాన పీఠలా
ఏటి శ్వాసలా మేటి భాషలా
ప్రశస్థ్య వేదమై నా తెలుగు
ప్రకాశించును నా తెలుగు
దేశ భక్తిని పంచే తెలుగు
జాతి కీర్తిని పెంచే తెలుగు
రమ్య కవనలా -కావ్య కన్యలా
శ్రావ్య గీతిలా - నవ్య కాంతిలా
విరాజిల్లును నా తెలుగు
విశ్వమంతా నా తెలుగు
- కోడిగూటి తిరుపతి
9573929493