Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాటాలకు మారుపేరు మా ఊరు
నేడు నిండుకుండలా తోలుకుతున్న గర్భశాల...
ఆ గర్బం నుండి పుట్టబోయే విప్లవ వీరులే...
రేపటి ఉద్యమానికి ఊపిరవుతారు
ఈ మట్టి ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు
ఉగ్గుపాలతో రంగరించి
ఉద్యమాలను పట్టించి
పోరాట తెగువ నేర్పిన పాఠశాల
చదువులోనే కాదు తెగింపులో సాటిగల
నాటి జార్జిరెడ్డి నుండి నేటి శ్రీకాంతాచారి (బోడ సునీల్) వరకు వీరులను సమాజ దివిటీలను అందించింది మా ఊరు
చరిత్ర పుటల్లో చెదిరిపోని అక్షరాలు లిఖించింది
నేడుజి
రజాకార్లను తలపించే పాలనను అంతం చేయగలిగేది
నీ ఒడిలో ఓనమాలు నేర్చిన వారే...
ఈ ప్రాంత ఉనికిని కాపాడుకోవడానికి మూడు ఏండ్ల పసి బాలుడి నుండి మూలుగ లేని ముసలోడి వరకు మొండి తనం చూపే తెగువ గల తెలంగాణ మట్టిమాణిక్యాలే
ఈ యోధుల లక్ష్యం ఒక్కటే సమసమాజ స్థాపనే....
- ఖాశీం జాలం
9014381377