Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచించవా
ఒంటరిగా వున్నప్పుడు..!!
నీ గుండె తలుపులను తోసి
నీకు తెలియకుండానే
నీలో ప్రవేశించి నిను కలవర పెట్టే
కాలం నీ మనసు ముంగిట్లో నిలుస్తుందని..!!
నీకే వేచే కనులు
నిన్నే తలిచే హదయం
నీలో నీకే లేని ప్రపంచాన్ని మాయ చేస్తుందని..!!
కురిసే చినుకులు
మెరిసే మెరుపులు
గడ్డిపోచపై మంచు బిందువులు..
ఏది చూసిన కొత్తదనమేనట్టు
ఒక ఉదయం నుండి హదయం లోకి..
చొరబడి నడి రేయి నిద్దురని మాయం చేస్తుందని
ప్రేమైక జీవంలోకి నడిపిస్తుందని..
నువ్వు ఎప్పుడైనా..ఎక్కడైనా చూసావా..!!
- స్వప్న మేకల
9052221870