Authorization
Mon April 21, 2025 02:47:38 pm
మనిషిని నమ్మి మగడు
మనసును నమ్మి మగువ
సర్వం నీవని నమ్మిన మగడు
సర్వస్వం నీదే నని అర్పించే మగువ
కాయంతో మొదలై కారుణ్యం వరకు
కలిసి పంచుకునే కష్టాలు
కలిసి పెంచుకునే సుఖాశీస్సులు
అణువణువు చూసే అతడు
అణుక్షణం గమనించే ఆమె
మనువుతో మొదలై
మరణంతో అమరమై
పురుషుడి కండ
పడతికి అండ, దిండు,
వనితల యుక్తి
మగడికి శక్తి, అనురక్తి
నీకు సాటి ఎవరు లేడనే మగువ
నీముందు దిగదుడుపు
అనే మగడు
అబద్ధాలని తెలిసినా బంధాల్ని పెంచే బలాలు
మగడు.......మగువ.......
-రేణుక పరిటాల