Authorization
Mon March 24, 2025 03:57:13 am
అమాంతం పెరిగిన
కూరగాయల ధరలకు
ఏమి కొనేటట్టు లేదు
ఏమి తినేటట్టు లేదు
టామాట అందనంత ఎత్తు
బెండకాయ పోటూ
అలుగడ్డ రేటు
ఉల్లిపాయ ఘాటు
పేదోడికీ పెద్దోడికీ
రుచిని నిచ్చేవి
శుచిగా తినేవి
పోషక గుణాలు వుండేవి
జీవ పక్రియలకు
సమతుల్యతను ఇచ్చేవి
ఆరోగ్యాన్ని ఆయుషును పెంచేవి
కూరగాయల ధరలు
ఆకాశమంటున్నాయి
జేబులో డబ్బులకు
జ్వరం వచ్చి కదలనట్టున్నరు
దీనీకన్న మేలు
చేపల పులుసు
చికెన్ వేపుడూలు
గుడ్డు కూరలు
హెచ్చుదలపై నోరు మెదపరు
తగ్గుదల గురించి కలిసిరారు
ఉపాయం లేని సదుపాయం
వినియోగదారులకు అపాయం
రోజు వారి శ్రమకు
తెల్లని మెతుకుకు
తోడవ్వని పచ్చనికూరలు
కొందరికి అందని ద్రాక్షపండే
నేటి కూరగాయల దరలు !
- పగిడిపల్లి సురేందర్ పూసల, 8074846063