Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం...
బులాతీ హై మగర్ జానే కా నఈ
వో దునియా హై ఉధర్ జానే కా నఈ
జమీన్ రఖ్నా పడే సర్ తో రఖో
చలో హౌ తో ఠహర్ జానే కా నఈ
హారు దునియా చోడనా మంజుర్ లేకిన్
వతన్ కో ఛోడ్ కర్ జానే కా నఈ
సితారే నోచ్ కర్ లే జాఊంగా
మై ఖాలీ హాథ్ ఘర్ జానే కా నఈ
మిరే బేటే కిసీ సే ఇష్క్ కర్
మగర్ హద్ సే గుజర్ జానే కా నఈ
వబా ఫైలీ హుయీ హై హర్ తరఫ్
అభీ మాహౌల్ మర్ జానే కా నఈ
అనువాదం:
తాను పిలుస్తుంది కానీ నువ్వెళ్ళడానికి లేదు
అదొక ప్రపంచం! అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు
ఈ భూమినే శిరస్సుపై భరించాల్సి వస్తే భరించు
నడవడం ప్రారంభించాక ఇక ఆగడానికి వీల్లేదు
లోకాన్ని విడిచి పెట్టడం నాకెప్పుడూ అంగీకారమే
కానీ దేశాన్ని విడిచి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు
తారలను సైతం తెంపుకు వెళ్తాను నేను
ఖాళీ చేతులతో మాత్రం ఇంటికెళ్ళేది లేదు
బిడ్డా! నువ్వెవరినైనా ప్రేమించు, కానీ
హద్దులు దాటెళ్ళడానికి మాత్రం వీల్లేదు
మహమ్మారి అన్ని దిక్కులా వ్యాపించింది
కానీ ఇది మరణించాల్సిన సమయమైతే కాదు
ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ షాయర్ (కవి), సినీ గేయ రచయిత, చిత్రకారుడు, డాక్టర్ రాహత్ ఇండోరీ, జనవరి 1, 1950లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జన్మించాడు. ఇతనూ అందరి విద్యార్థుల్లాగానే తన ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేసాడు. ఇంట్లోని ఆర్థిక ఇబ్బందుల వల్ల పదేళ్ళ వయసు నుండే, రాహత్, సైన్ బోర్డులు వేస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. ఇదే వత్తిని పదేళ్ళ వరకు కొనసాగించాడు. 19 ఏళ్ళు ఉండగానే షాయరీ చెప్పడం మొదలు పెట్టిన రాహత్ కి, తరచుగా ముశాయిరాలకు, కవి సమ్మేళనాలకు వెళ్ళడం వల్ల, ఉర్దూ షాయరీ పైన, ఉర్దూ సాహిత్యంపైన ఆసక్తి ఏర్పడింది. అదే ఆసక్తితో, బర్కతుల్లాV్‌ా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ ఉర్దూ పట్టా, అలాగే భోజ్ విశ్వవిద్యాలయం నుండి ''ఉర్దూ మే ముశాయిరా'' అనే అంశంపై గ్రంథ సమర్పన చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు. గజల్ ప్రక్రియపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి, గజల్ ఆత్మను తన కలంలో అంతర్లీనం చేసుకున్నాడు. శ్రోతల ముందు, రాహత్ గజల్ ని ప్రెజెంట్ చేసే విధానం ఎంతో విన్నూత్నంగా ఉంటుంది. రాహత్ ఏది చెప్పినా కొండంత ఆత్మస్థైర్యంతో నిక్కచ్చిగా చెప్పేవాడు. తన కలానికి ఎంతటి శక్తి ఉందంటే, అది ఒకసారి వీరఖడ్గమై గుండెను చీల్చి చెండాడుతున్నట్లుగా అనిపిస్తుంది. మరోసారి ఒక తల్లిలా, తండ్రిలా జీవితంలోని మర్మాలను, విశ్వసత్యాలను బోధిస్తున్నట్లుగా, ఇలా రకరకాల భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఈ శైలి కేవలం రాహత్ కి మాత్రమే సొంతం. ఈ శైలే రాహత్ ని ఎన్నో ముశాయిరాలను, కవి సమ్మేళనాలను అమాంతం దోచుకునేలా చేసింది. రాహత్ ముశాయిరా ప్రస్థానం ఒక 40-45 సంవత్సరాల వరకు సాగింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, అలాగే అమెరికా, బ్రిటెన్, కెనడా వంటి పెద్ద పెద్ద దేశాల్లో తాను చేసిన కవిత్వ ప్రదర్శనలు, రాహత్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. గజల్, నజ్మ్, గీత వంటి ప్రక్రియల్లో ఎక్కువగా సాహిత్య సజన చేసిన రాహత్, మేరే బాద్, ధూప్ బహుత్ హై, చాంద్ పాగల్ హై, మౌజూద్, నారాజ్ మొదలైన పుస్తకాలను రాసాడు. సినీ గేయ రచయితగా రాహత్, మున్నా భారు ఎమ్.బీ.బీ.ఏస్, ఇష్క్ వంటి ప్రముఖ చిత్రాలకు పాటలు రాసాడు. అనూ మాలిక్, ఏ. ఆర్. రెహమాన్ వంటి గొప్ప సంగీత దర్శకులతో పని చేసాడు. ప్రొఫెసర్‌గా ఎందరో విద్యార్థులకు ఉర్దూ సాహిత్య పాఠాలను చెప్పి, ఎనలేని సాహిత్య కషి చేసాడు. 11 ఆగష్టు 2020న, కరోనా కష్ట కాలంలో గుండె పోటుతో, రాహత్ భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళాడు. ఆధునిక ఉర్దూ గజళ్ళలో, యవ్వనం నేపథ్యంగా వచ్చిన వాటిల్లో రాహత్ గజళ్ళు ప్రత్యేకమైనవి. అవి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి హదయాలను ఆకట్టుకుంటాయి. అవి శ్రోతల హదయాలను ఆకాశమెత్తుకు ఎగిరేలా చేస్తాయి. చాలా సార్లు విషాదంతో పాతాళానికి జారిపోయేలా కూడా చేస్తాయి. ఏదేమైనా గజల్ రచనలో రాహత్ ది అందెవేసిన చేయి అని చెప్పడంలో సందేహమే లేదు. రాహత్ ఎమ్.ఐ.ఈ.టీ మీరుట్ లో జరిగిన ఒక కవి సమ్మేళనంలో గజల్ గురించి ఇలా చెప్తాడు- ''నేను ఒక 20-25 సంవత్సరాల వరకు ఒక విశ్వవిద్యాలయంలో గజల్ ని చదివి నేర్చుకున్నాను. కాబట్టి నాకు తెలుసు- గజల్ చదవాలన్నా, చదివించాలన్నాబీ గజల్ వినాలన్నా, వినిపించాలన్నాబీ గజల్ అర్థం చేసుకోవాలన్నా, అర్థం చేయించాలన్నాబీ మనిషి తనని తాను కొంత పిచ్చివాడిగా, ప్రేమికుడిగా, ఔత్సాహికుడిగా, అన్నింటికంటే మించి కొంత క్యారెక్టర్ లెస్ గా భావించుకోవాల్సి వస్తుంది''. ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్ ''బులాతీ హై మగర్ జానే కా నఈ'', దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. వాహనాల మీద, గోడల మీద, వేసుకునే చొక్కాల మీద ఇలా దేని మీద పడితే దాని మీద, ఈ గజల్ లోని మొదటి రెండు లైన్లు కనబడ్డాయి. దీనంతటికీ మొదలు ఒక టిక్ టాక్ వీడియో నుండి ప్రారంభమైంది. ఎవరో ఒకరు ''బులాతీ హై మగర్ జానే కా నఈ/వో దునియా హై ఉధర్ జానే కా నఈ/మిరే బేటే కిసీ సే ఇష్క్ కర్/మగర్ హద్ సే గుజర్ జానే కా నఈ'' అనే ఈ రెండు షేర్లు తీసుకుని ఆక్టింగ్ చేస్తూ తీసిన వీడియోని టిక్ టాక్ లో పోస్ట్ చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అయింది. దీని వల్ల రాహత్ కి మరింత గుర్తింపు లభించింది. వైరల్ అయిన 2 షేర్లతో పాటు, ఈ గజల్లో ముత్యాల్లాంటి మరికొన్ని షేర్లు కూడా ఉన్నాయి. 2వ షేర్లో, కవి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురుకోవాల్సిందే, వెనకడుగు వేయొద్దని ధైర్యం చెప్తాడు. 3వ షేర్లో, రాహత్ తనలోని దేశభక్తిని గర్వంగా చాటుతాడు. అన్ని షేర్లు ఒక ఎత్తైతే 4వ షేర్ ది మరో ఎత్తు. ఆకాశంలోని తారలను సైతం తెంపుకుని వెళ్ళే ధైర్యం బహుశా రాహత్ ఇందౌరీకి మాత్రమే ఉంటుందేమో మరి.
( జనవరి 1 రాహత్ ఇందౌరీ జయంతి సందర్భంగా....)
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256