Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిినిమా నేపథ్యం లేదు... నాటక రంగ నేపథ్యమూ కాదు. సినిమా అంటే ఇష్టం అంతే.. చదువు ముగించుకొని ఉద్యోగాల వేటకై నగరంలోకి అడుగుపెట్టే నాటికి అతని మనసులో లేని ఆలోచన నేడు అతడిని ఒక సెలబ్రెటిని చేసింది. చదువు ఉద్యోగం అని వచ్చిన ఆ యువకుడే నేడు ఎందరికో నటనలో పాఠాలు చెబుతున్నాడు. నటన, నాటకం తన జీవితాన్ని అనేక మలుపులు తిప్పాయి. ఆ సాదాసీదా మూడు పదుల యువకుడు నటుడిగా, దర్శకుడిగా, రచయితగా అభినందనలు అందుకుం టున్నాడు. సినిమాకు టిక్కెట్ పై వెళ్లడమే తప్ప... తాను నటించిన సినిమాకు అందురూ టిక్కెట్ కొంటారని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కలను సాకారం చేసింది నాటకమే. నటనలో ఓనమాలు తెలియని తనను పెద్ద నటులతో నటించే అవకాశాన్ని ఇచ్చింది ఆ నాటకమే అంటున్న యువ నాటక మార్గ'దర్శకుడు' అజరు మంకెనపల్లి పరిచయ కథనం ఈ వారం జోష్...
అజయ్ మంకెనపల్లిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామం. నాన్న ధనకోటి, అమ్మ వెంకట నరసమ్మ. తమ్ముడు ప్రవీణ్. ఒక మధ్యతరగతి చిన్న కుటుంబం. ఖమ్మంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటకై 2012లో హైదరాబాద్ వచ్చాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన మిత్రునితో ఉంటూ గ్రూప్స్‌కు సిద్ధం అవుతున్నాడు. సినిమా అంటే ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ సినిమాను నేలకొండపల్లి ప్రాంతంలో రైట్స్ కొన్న ఆసక్తే తప్ప నటుడు అవ్వాలని అనుకోని వ్యక్తి తన స్నేహితుడి మాటతో తన గమ్యాన్ని మార్చుకున్నాడు. ఆ మిత్రుని మాటలతోనే ఆసక్తి కొద్దీ తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళాశాఖలో ఎంపిఏ పూర్తి చేసాడు. ప్రస్తుతం ఎంఫీల్ చేస్తున్నాడు.
క్రియేటివ్ థియేటర్
వెండితెరపై వెలగాలని కలలు కనేవారు కోకొల్లలు. నటులుగా రాణించాలంటే అభినయంపై అవగాహన అవసరం. అభినయం అంటే ఆషామాషీ కాదు. నాటక రంగంలో నిలదొక్కుకోవాలన్నా, బుల్లి తెరపైనో, వెండితెరపైనో వెలగాలన్నా నటనపై గట్టి పట్టు ఉండాల్సిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నటులుగా రాణించాలంటే అందులోని మెలుకువలు తెలుసుకోవాలి. అలాంటి శిక్షణతో రంగస్థల నటులను తయారు చేస్తుంది క్రియేటివ్ థియేటర్.
అజరు ''క్రియేటివ్ థియేటర్'' సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తు న్నారు. తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్ అభివద్ధికి కషి చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సహకారంతో నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజరు మంకెనపల్లి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాలలు శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించి.. ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు , బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నారు. షేక్స్ఫియర్ నాటకాన్ని తెలుగులో నాటకీకరించి ప్రదర్శించారు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు పది సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించారు.
తన ''క్రియేటివ్ థియేటర్'' నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యువతి యువకులను నటులుగా తయారుచేస్తు న్నాడు. నటన అంటే కేవలం అనుకరణ కాదని, అందులో జీవించడం ద్వారానే సహజంగా నటించగలరు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి అజరు. అదే తన 'క్రియేటివ్ థియేటర్' వర్క్ షాప్ ద్వారా కొత్త నటులకు నేర్పుతున్నారు. తన కంటూ ఒక సిలబస్ రూపొందించుకొని తనదైన ప్రత్యేక ముద్రను నాటక రంగంలో కనబరుస్తు న్నారు. 'క్రియేటివ్ థియేటర్' ఇప్పటి వరకు మూడు వర్క్ షాప్‌లు నిర్వహించింది. 'క్రియేటివ్ థియేటర్ తయారుచేసిన నటులతోనే ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ రచించిన 'అసమర్ధుడు' నాటకం అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో నాటకం రూపొందించారు. అది ఇప్పటికే రెండు సార్లు రవీంద్రభారతిలో ప్రదర్శించ బడింది. మెర్సీ రాసిన మరో నాటికం 'త్రిపుర శపథం' కూడా అజరు మంకెనపల్లి దర్శకత్వంలో రవీంద్ర భార తిలో జనవరి 5న ప్రదర్శించ పడుతుంది. ఇది అతికొద్దికాలంలోనే 'క్రియేటివ్ థియేటర్' ద్వారా అజరు సాధించిన విజయం.
మరికొన్ని....
- రచనలు మరియు నాటకీకరణ
- గాడ్ మంకీ డెవిల్
- ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్
- ఆలోచన, 7 మార్పు
రంగస్థలంలో చేస్తున్న కషి
- వన్ మంత్ ఆక్టింగ్ వర్క్ షాప్
- ప్రొడక్షన్ ఓరియెంటెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ సీజన్ 1
- రంగ మహౌత్సవం
- ఖమ్మం యువ నాటకోత్సవం
- ప్రొడక్షన్ ఓరియెంటెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ సీజన్ 2
- ప్రొడక్షన్ ఓరియెంటెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ సీజన్ 3 (జరుగుతున్నది )
- ప్రొడక్షన్ ఓరియెంటెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ సీజన్ 4 జనవరి 8, 2022 నుంచి ప్రారంభం
నటించిన నాటకాలు - నత్యరూపకాలు
- పలనాటి యుద్ధం
- నిశ్శబ్దం
- జ్యోతిరావు పూలే
- నాయకురాలు
- బతుకమ్మ
- రజాకార్
- నోటు భారతం
- జయ జయహే తెలంగాణ
- గాడ్ మంకీ డెవిల్
- గొల్ల రామవ్వ
- స్వక్షేత్రం
- గాలి గోపురం
- కాగితం పులి
- గబ్బర్ సింగ్
- జంబుద్వీపం
- లోకా సమస్తా సుఖినోభవంతు
దర్శకత్వం వహించిన నాటకాలు
- అసమర్ధుడు
- త్రిపుర శపథం
- గొల్లరమవ్వ
- గాడ్ మంకీ డెవిల్
- ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్
- నానాజాతి సమితి
- ఆలోచన
- మార్పు
అవార్డులు
- రంగస్థల యువ పురస్కారం 2020-21(తెలుగు విశ్వవిద్యాలయం)
- జాతీయ రఘుబాబు నాటకోత్సవాల్లలో గొల్ల రామవ్వ నాటకానికి గాను ఉత్తమ నాయకుడు, బెస్ట్ సపోర్టింగ్ రోల్)
- యూత్ అవార్డు 2021
సింగిడి యంగ్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్
నటించిన సినిమాలు
- అర్థ శతాబ్దం
- ఆకాశవాణి
- పుష్ప
- ఘోడా
- ఉస్తాద్
- మధ
- భీమ్లా నాయక్
- సైరా
షార్ట్ ఫిలిమ్స్
- ది లాస్ట్ చాప్టర్
- ఇలా జరిగితే
- అఆఅ
- అనంతోజు మోహన్‌కృష్ణ