Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నెన్నో కలలు,
మరెన్నో ఆశలతో
ఎప్పుడెప్పుడు
ఈ లోకాన్ని సందర్శిద్దామా ...
ఈ అందమైన ప్రకతిని ఎప్పుడు ఆస్వాదిద్దామా..
అని
ఎదురు చూస్తూ బయటికి రావాలనుకునే నేను
ఆడపిల్లను అని తెలిసి,
పరిజ్ఞానం పెరిగిన అజ్ఞానులే
గర్భగుడినే సమాధిగా మార్చేశారని తెలిసి,
అడుగు వేయకముందే
కాళ్లను నరికి
మాటని గొంతులోనే దాచి
నన్ను అశుభంగా తలచి
చిదిమేస్తున్న
ఈ లోకాన్ని చూసి
సిగ్గుగా ఉంది..
- సుచిత్ర గూడూరు, ఐఐఐటి బాసర