Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి తన పయనంలో
తాననుకోని మార్గంలో
తెలియని జీవనగమనం
ఎదురౌతుంటదొక్కోసారీ
జంకక అడుగు ముందుకేయడమే విజయసూత్రం
కలలు నెరవేర్చుకునే క్రమంలో
అలలకు ఎదురెల్లక తప్పదు
తీరం కనపడకపోయినా
అలుపెరగక ఆగిపోక సాగాలి
తెలియని ప్రశ్న ఎదురైనపుడు
సమాదానమేదోచోట తారసపడక తప్పదులే
ప్రయత్నించమే మనిషితనం
నీవనుకున్నదాన్ని సాధించడం
ఒక్కొసారి ఆలస్యమవ్వొచ్చు
ఆగిపోయావంటే అపుడు
నీవో జీవశ్చవానివేగాక మరేమి
జీవితమందరికొకటే
ఏర్పరచుకునే లక్ష్యానికి హద్దు
ఆకాశమంతుండాలి
ఆ ఆశే శ్వాసై సాగాలి
అందరికీ ఆదర్శమవ్వాలి
పరిశీలిస్తూ పయనం సాగించు
తారసపడే సన్నివేశమేదైనా
ఆశయసాధనకది ఇంధనమవ్వాలి
లోకమంతా తెలిసేలా విజయం
ఇంద్రధనుస్సై విరియాలి
- సి. శేఖర్(సియస్సార్), 9010480557.