Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రషీద్ ఇతర రాష్ట్రాల్లో టోర్నమెంట్లు జరిగేటప్పుడు ముందస్తుగా ట్రెయిన్ టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవడానికి డబ్బులు లేక మ్యాచ్‌కు ముందు రోజు జనరల్ బోగీలో ప్రయాణించేవాడు. రషీద్ ప్రాక్టీస్‌కు కావాల్సిన బంతులను సమకూర్చడానికి అతని తండ్రి ప్రయివేటు ఉద్యోగం చేయడంతో పాటు మార్కెట్లో పండ్లు కూడా అమ్మేవాడు. రషీద్ ఆటతో అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు కుర్రాడు మరోసారి జాతీయ స్థాయిలో మెరుస్తుండడంతో రెండు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఓ కుర్రాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ తారై మెరుస్తున్నాడు. భారత అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వడమే కాకుండా భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడే షేక్ రషీద్.
గుంటూరులోని పత్తిపాడు మండలం మల్లయ్యపాలెంలో 2004లో సెప్టెంబర్ 24న షేక్ రషీద్ సామాస్య కుటుంబంలో జన్మించాడు. తండ్రి బాలీషా వలీ భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. పరిస్థితుల ప్రభావంతో అది సాధ్యం కాలేదు. తన పిల్లల ద్వారా తన కలను సాకారం చేసుకోవాలని పరితపించాడు. అది తన చిన్న కొడుకు రషీద్ రూపంలో తన కలను నెరవేర్చుకున్నాడు.
రషీద్ ఆటలో నైపుణ్యం గమనించిన తండ్రి కొడుకు కెరీర్ కోసం తన బ్యాంక్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అయితే మొదట్లో రషీద్‌కు అవకాశాలు రాలేదు. అయితే తొమ్మిదేండ్లకు అండర్-14 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అనంతరం అంతర్ జిల్లాల పోటీల్లో పన్నేండేండ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. అనంతరం ఆంధ్ర క్రికెట్ సంఘం(ఏసీఏ)కు చెందిన మంగళగిరి అకాడమీ కోసం అతని కుటుంబం మళ్లీ గుంటూరుకు వచ్చింది. 13 ఏండ్ల వయస్సులో రషీద్ కు ఇంగ్లాండ్ లో రెండు నెలల పాటు శిక్షణ పొందే అవకాశం దక్కింది. 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రషీద్ నిలిచాడు. కొంతకాలం ఆంధ్రా అండర్ 16 జట్టులో ఆడాడు. తర్వాత అండర్-19 జట్టుకు ఎంపికై తన సత్తా చాటాడు. ఒకే ఏడాది 680 పరుగులు చేసి జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఛాలెంజర్స్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో మంచి ప్రదర్శన చేయడం అందరినీ ఆకర్షించింది. బంగ్లాదేశ్ లో జరిగిన ట్రై సిరీస్ అండర్ -19 టీమిండియా జట్టుకి ఎంపిక కావడం అతని కెరీర్‌ని మార్చేసింది. ఆసియా కప్‌లోనూ రషీద్ దుమ్ములేపాడు.
తాజగా అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికై ఆడిన నాలుగు మ్యాచ్‌లో రెండు అర్ధ సెంచరీ లతో సత్తా చాటాడు. అయితే మధ్యలో అతనితో పాటు మొత్తం ఆరుగురు జట్టు సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా రావడంతో ఆందోళన చెందాడు. కానీ తిరిగి బరిలోకి దిగిన అనంతరం తన సత్తా ఏంటో చాటాడు. సెమీఫైనల్స్‌లో ఓపెనర్లు తక్కువ పరుగులకే అవుటవ్వగా అతను 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్లోనూ అద్భుతంగా ఆడి అర్థ సెంచరీ సాధించి మరోసారి భారత జట్టు వరల్డ్ కప్ ను ముద్దాడేలా చేశాడు. ఇప్పటివరకు ఎనిమిది ఇంట ర్నేషనల్ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసిన రషీద్.. 55.6 సగటుతో 334 రన్స్ చేశాడు. రషీద్ ఇతర రాష్ట్రాల్లో టోర్న మెంట్లు జరిగేటప్పుడు ముందస్తుగా ట్రెయిన్ టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవ డానికి డబ్బులు లేక మ్యాచ్‌కు ముందు రోజు జనరల్ బోగీలో ప్రయాణిం చేవాడు. రషీద్ ప్రాక్టీస్‌కు కావాల్సిన బంతులను సమకూర్చడానికి అతని తండ్రి ప్రయివేటు ఉద్యోగం చేయడంతో పాటు మార్కెట్లో పండ్లు కూడా అమ్మేవాడు. రషీద్ ఆటతో అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు కుర్రాడు మరోసారి జాతీయ స్థాయిలో మెరుస్తుండడంతో రెండు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనున్నట్టు బీసీసీఐ తెలిపింది. దీనిపై షేక్ రషీద్ స్పందిస్తూ.. తాను ఇంత డబ్బును ఎప్పుడూ చూడలేదన్నాడు. అందులో కొంత డబ్బుతో తన కుటుంబం కోసం ఇల్లు నిర్మిస్తానన్నాడు. మరికొంత డబ్బు తన కెరీర్ కోసం ఖర్చు చేస్తానన్నాడు. భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు వెళ్తానని రషీద్ చెబుతున్నాడు. అయితే షేక్ రషీద్ పేరు ఐపీఎల్ మెగా వేలంల జాబితాలో లేదు. ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనే అండర్ 19 ఆటగాళ్లు ఆయా రాష్ట్రాల జట్ల తరఫున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ, లిస్ట్ ఏ గేమ్ కానీ ఆడి ఉండాలి. అయితే షేక్ రషీద్‌తో ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో పాటు లిస్ట్ ఏ గేమ్ ఆడలేదు. దాంతో అతను మెగా వేలంకు ఎంపిక కాలేదు.
పన్నెండ్లేకే ట్రిపుల్ సెంచరీ...
మొదట్లో రషీద్‌కు అవకాశాలు రాలేదు. అయితే తొమ్మిదేండ్లకు అండర్-14 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అనంతరం అంతర్ జిల్లాల పోటీల్లో పన్నేండేండ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. అనంతరం ఆంధ్ర క్రికెట్ సంఘం(ఏసీఏ)కు చెందిన మంగళగిరి అకాడమీ కోసం అతని కుటుంబం మళ్లీ గుంటూరుకు వచ్చింది. 13 ఏండ్ల వయస్సులో రషీద్ కు ఇంగ్లాండ్ లో రెండు నెలల పాటు శిక్షణ పొందే అవకాశం దక్కింది. 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రషీద్ నిలిచాడు. కొంతకాలం ఆంధ్రా అండర్ 16 జట్టులో ఆడాడు. తర్వాత అండర్-19 జట్టుకు ఎంపికై తన సత్తా చాటాడు. ఒకే ఏడాది 680 పరుగులు చేసి జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఛాలెంజర్స్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో మంచి ప్రదర్శన చేయడం అందరినీ ఆకర్షించింది.
- సి.హెచ్. శివ కిరణ్ ,9396633314