Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టణ., నగరాల శివారు
విలాస విడిది ప్రాంతాల్లో...
రాత్రి పగలు తేడా లేని
పబ్బుల్లో క్లబ్బుల్లో..
ఫ్యాషన్ కల్చరని మురిసే
నాగరికత ముసుగేసుకున్న
నగదేహాలన్నీ కూడి
కొరివి దయ్యాల్లా నర్తిస్తూ..
విశృంఖల విలాసాలు...
కుటుంబ బంధాలు విడిచి..
నైతిక విలువలు మరచి..
ఖరీదైన పార్టీల పేర
విచ్చలవిడి సరదాల్లో...
కొందరు..
పేరు మోసిన పెద్దోళ్ళు
తెరమీద మెరిసే బొమ్మలు..
ఉద్యోగ వ్యాపారస్తులు
ఉన్నత విద్యావంతులు
సంపన్న కుటుంబాల కులసా జీవులు..
అడ్డు అదుపులేని
అనైతిక సంపాదనతో..
జల్సాలకు తిరిగి మరిగి...
డ్రగ్స్ మత్తులో నిండా మునిగి..
కనులకు ఇంపుగా తోచిన
చెడిన కంపు దేహాలన్నీ..
మాంసపు ముద్దలను పీక్కుతినే
మదమెక్కిన మృగాల్లా..
ఒళ్ళు మరిచి బరితెగించి
కులుకుతున్న జీవాలు...
ఈ హైటెక్ సరదాల మాటున
అసాంఘిక కార్యాలు..
నాగరికత తెలిసినోల్లే నాశనానికి కారకులు..
- రాచర్ల శ్రీనివాస్
సెల్ : 9704246125