Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలిమిలో ఎర్రగా కాల్చిన
ఇనుప ముక్క పై నీళ్ళు కుమ్మరించే ఇనుము వాసనతో గుప్పున గుప్పున పొగలు చిమ్మే
నిప్పు కణాలు వెదజల్లే ఎండలో కారు మబ్బులు కమ్మే పెళపెళ ఉరుములతో హోరు గాలి వాన వచ్చే. మట్టి వాసన అత్తరు జగమంతా చిలికించే
పుడమినంత చాపలా చుట్టి
ఆకాశమంత ఫ్రిజ్లో పెట్టే
ఉక్కపోతను ఉరికించి తరిమితరిమి కొట్టే
చెట్టు చెట్టు ఫ్యాన్స్ అయి తిరుగాడే
చిగురాకులు విసన కర్రలై విసుర సాగే
పక్షులు కిల కిలా రాగముతో ఆనంద నాట్యం చేసే
జీవ రాశులు తొంగి చూసి ప్రకృతి కి పరవశమాయే
రైతన్న కు చిగురించిన ఆశల వేళ
రగిలించిన కరువు కాటకాల మేళ
వర్ష ఋతువు గొంగడి ముసుగులో
చాటున దాడి చేసే జడివాన సుడి గాలితో చెట్టు చేమని ధ్వంసం చేసే
నోటికి వచ్చిన పంట దోపిడీ చేసే
చల్లగా పలుకరించి మోసం చేసే
- పూసాల సత్యనారాయణ
హైదరాబాద్