Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్ధరాత్రి అంతరంగంలో ప్రసవవేదనపడి పొద్దున్నే ఉదయించే కవి సీతారామరాజు. ఖండాలవతల కవితా పుష్పమై పూసి జ్ఞాన పరిమళాలతో సాహితీ వనాన్ని తయారుచేసే కవి సీతారామరాజు. నానీల నావలో ప్రయాణించి సాహితీ తీరాన జెండాగా రెపరెపలాడుతున్న కవి సీతారామరాజు. ఈ కవి జలచక్రపు భాగ్యసిరిని, చినుకు సొగసుని కవిత్వంచేసి అనుభూతుల మబ్బుల్లోంచి అక్షరవాన కురిపిస్తాడు. సింగిడి రంగులనేల సౌభాగ్యాన్ని ముందుండి పాడతాడు, జీవితాన్ని చిలికి కవితామృతాన్ని పంచుతాడు. బియ్యం చెరుగుళ్లలో రైతు పాదాల చప్పుళ్ళు వింటాడు, మనకు వినిపిస్తాడు.
'దక్షిణాఫ్రికా నానీలు'తో మొదలైన వీరి సాహితీ ప్రయాణానికి ముందు ఎన్నోఏండ్ల అధ్యయనపు అడుగులున్నాయి. ప్రాచీన సాహిత్యం నుంచి ఈరోజు దినపత్రికలో అచ్చయిన కవిత్వం దాకా, మహాభారత శ్లోకాల నుంచీ జపనీస్ హైకూల దాకా, యాత్రా విశేషాల నుంచీ వెండితెరమీద వెలిగే పాత్రలదాకా అన్నీ ఈయన అధ్యయన జిజ్ఞాసాదారులగుండా ప్రయాణించినవే. వచన కవిత్వాన్ని అద్భుతంగా రాయగల సీతారామరాజు ఎందుకో పుస్తకరూపంలో మనల్ని ఇంకా పలకరించలేదు.
సాహిత్యాభిలాష అంటే కేవలం పుస్తకాల్ని చదవడం మాత్రమే
కాదు, చదవాలన్న కోరికని చుట్టూ ఉన్న సమాజంలో
కలిగించడం, అక్షరం మీది ఇష్టాన్ని సమూహంతో
పంచుకోవడం. ఎవరి అధ్యయనం వారే చేసుకుంటూ,
ఎవరి సాహిత్యం వారే రాసుకొనే ఈరోజుల్లో అందర్నీ
కలుపుకొని ముందుకు సాగే కవి, అధ్యయన శీలి, సమీక్షకుడు,
విమర్శకుడు, నిబద్ధత గల సాహిత్యాన్వేషి
''రాపోలు సీతారామరాజు''.
నల్లగొండ జిల్లా నేరడ గ్రామంలో రాపోలు యాదగిరి, అనసూయ దంపతులకు పుట్టిన సీతారామరాజుకి బాల్యంనుండి కవిత్వ అల్లికల మీద అనురక్తి ఎక్కువ. వీరిది మధ్యతరగతి చేనేత కుటుంబం. వీరి కుటుంబంలో వీరిదే మొదటి చదువుకున్న తరం అయినా విపరీతమైన పుస్తక పఠనం, జిజ్ఞాస వలన మంచి సాహిత్యకారుడిగా రాణిస్తు న్నారు. నేరడలో ప్రాధమిక విద్య, ప్రతిష్టాత్మక జవహర్ నవోదయ విద్యాలయంలో ఉన్నత విద్య, సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతిక విద్యను పూర్తిచేశారు. అయితే ఎక్కడ ఉన్నా భాషాభిమానాన్ని, అధ్యయనశీలాన్ని వదిలిపెట్టలేదు. రాయడం కంటే చదవడం ఇష్టంగా పెరిగారు. ఆ చదవడమే ఆయనతో రాయించింది. సాహిత్యపఠనం వలన ఒక విషయాన్ని చూసే దృక్కోణంలో మార్పు, వ్యావహారిక జీవితంలో పరిణతి వస్తాయని సీతారామరాజు బలంగా నమ్ముతారు.
'దక్షిణాఫ్రికా నానీలు'తో మొదలైన వీరి సాహితీ ప్రయాణానికి ముందు ఎన్నో ఏండ్ల అధ్యయనపు అడుగులున్నాయి. ప్రాచీన సాహిత్యం నుంచి ఈరోజు దినపత్రికలో అచ్చయిన కవిత్వం దాకా, మహాభారత శ్లోకాల నుంచీ జపనీస్ హైకూల దాకా, యాత్రా విశేషాల నుంచీ వెండితెరమీద వెలిగే పాత్రలదాకా అన్నీ ఈయన అధ్యయన జిజ్ఞాసాదారులగుండా ప్రయాణించినవే. వచన కవిత్వాన్ని అద్భుతంగా రాయగల సీతారామరాజు ఎందుకో పుస్తకరూపంలో మనల్ని ఇంకా పలకరించలేదు. ఈమధ్యే పరావర్తనం అంటూ సాహిత్యవ్యాసాల్ని ఇష్టంగా ఆవిష్కరించుకున్నారు. మొదట్లో దక్షిణాఫ్రికా దేశం నుంచి ఈయ నొక్కడే తెలుగు సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు తనతో నలుగురైదుగురిని పోగేసుకుని నిఖార్సైన సాహితీ వ్యవసాయం చేసున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా దేశం నుంచి నాలుగు తెలుగు పుస్తకాలు సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి.
పరాయి దేశంలో ఉంటూ కూడా తనభాషని, భావుకతని కాపాడుకుంటున్నారు. ఇక్కడి సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నంతోపాటు మన విధానాల్ని చాటింపువేస్తున్నారు. ఇక్కడి పిల్లల్లో భాషాసక్తిని గ్రహించి మనబడి ద్వారా వందలాది పిల్లలకు నిర్దిష్ట బోధనా పద్ధతులద్వారా, సుశిక్షితులైన అధ్యాపక బృందంతో తెలుగును నేర్పిస్తున్నారు. వారాంతాలలో తెలుగు వెలుగుల్ని వెలిగించే అక్షరదివిటీ అవుతున్నారు. వారంతా తెలుగులో మాట్లాడుతుంటే మురిసిపోతున్నారు. ఇదంతా ఉచితంగా మాత్రమే కాదు హృదయచిత్తంగా కూడా. ఉద్యోగపు బాధ్యతా వలయంలో చిక్కుకొని కూడా ఇలాంటి మహాకార్యాలు చేయాలంటే చాలా నిబద్దత, ఇష్టం ఉండాలి. మరీ ముఖ్యంగా కుటుంబ సహకారం ఉండాలి, ఆ విషయంలో ఈయన అదృష్టవంతుడు.
భారతీయ సంతతికి చెందిన వారు దక్షిణాఫ్రికాలో చాలా మంది ఉన్నారు. వారంతా దశాబ్దాల క్రితం వివిధ కారణాలవల్ల అక్కడకి వెళ్లి స్థిరపడ్డారు. తెలుగుభాషని మాట్లాడలేక పోయినా ఇంకా ఆ సంప్రదాయాలని పాటిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అలాంటి వారికి తెలుగు భాషని దగ్గరచేసే భాషాభ్యుదయానికి పూనుకున్న వ్యక్తి సీతారామరాజు. వాళ్ళు తెలుగు నేర్చుకొని, సంస్కృతీ సాహిత్యాల పట్ల ఆసక్తులై, కొన్ని తరాల తరువాత మాతృనేలని దర్శించడానికి వచ్చి తన్మయులైన సందర్భాలున్నాయి. దక్షిణాఫ్రికా భారతీయుల సభల్లో తెలుగువారి ప్రతినిధిగా సీతారామరాజు చేసిన ప్రసంగాలన్నీ మహాద్భుతాలే. దక్షిణాఫ్రికాలో రేడియో ప్రసారాల్లో ప్రసంగించి వారిలో తెలుగుమీది అనురక్తిని తట్టిలేపారు, తెలుగు ఉనికిని చాటిచెప్పారు. తెలుగు సంఘాలు చేసే సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయ సంతతిని ఆహ్వానించి అమ్మభాష తీయందనాల్ని వారికి రుచి చూపించిన ఘనమైన ఘనత సీతారామరాజుదే. ఈయన దక్షిణాఫ్రికా జీవనవిధానం మీద, చారిత్రిక విశేషాలమీద అధ్యయనం చేస్తున్నారు. త్వరలో దక్షిణాఫ్రికా మీద తెలుగులో సమగ్రమైన పుస్తకం రాసే ఆలోచనతో ఉన్నారు. బహుశా తెలుగులో అదే దక్షిణాఫ్రికా జీవనవైచిత్రిపై ఇక్కడ నివసించి, కళ్లారా చూసి, అనుభవించి రాసిన మొదటి పుస్తకం అవుతుందేమో!
తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ''ప్రపంచ తెలుగు మహాసభల''కు దక్షిణాఫ్రికా ప్రతినిధిగా ఆహ్వానం మేరకు వెళ్లి, ప్రసంగించి అక్కడి జీవనవిధానాలని ప్రపంచానికి తెలియజేసారు. దక్షిణాఫ్రికాలో నివసించే తెలుగువారు గర్వపడేలా చేశారు. ఆ సభల్లో అయిన పరిచయాలు, దొరికిన సాహితీవేత్తల ప్రేమ తన జీవితాన్ని, దృక్కోణాన్ని మార్చివేసిందని ఆయన చెప్పుకుంటారు. సీతారామరాజు గారి మాటలు ఎందరికో స్ఫూర్తిని, సాహిత్యం మీద అభిరుచిని కలుగజేసాయి. ఈయన ప్రభావంతో పుస్తకపఠనం అలవాటు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఎందరో మంచి కవులని పుస్తకరూపం దాల్చమని ప్రోత్సహించారు. ఎడిటింగ్, డిజైనింగ్, ప్రింటింగ్ బాధ్యతలు నెత్తినవేసుకొని వారి కవిత్వాన్ని మోశారు. వారిపుస్తకాన్ని వారికే బహుమతిగా ఇచ్చారు. సుదూరాన ఉన్న కవులతో నిత్యం సంభాషించడం, ఏ కవిత బాగున్నా రాసిన కవిని అభినందించడం, ప్రోత్సహించడం ఈయనకు అలవాటు. ఆలా సాహిత్యం పరిచయం చేసిన కవులే ఇప్పుడు ఈయనకి మంచి స్నేహితులయ్యారు. వారితో కలిసి సాహితీఖడ్గాన్ని పదును పరచుకుంటున్నారు.
''దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక'' - చెరగని చిరునవ్వుతో సాహిత్యాభిమానులని, భావాలను కవిత్వం చేయగలిగే వారిని ఒక్కచోటికి చేర్చి, మాటల చలిమంటల్లో మనసుల్ని కాచుకునేట్లు చేసిన అనుసంధానధీరుడు సీతారామరాజు మానస పుత్రిక ఈ సాహిత్య వేదిక. ఈ వేదికగా కేవలం దక్షిణాఫ్రికాలో నివసించే కవులకే కాదు ప్రపంచ తెలుగు సాహిత్యోద్యమంలో తన వంతు పాత్రని పోషిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రశంసలు పొందుతున్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సారథ్యంలో ప్రతిష్టాత్మక '7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'ని దక్షిణాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్ వేదికగా అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్రధారి సీతారామరాజు. ప్రపంచంలోని భాషా ప్రేమికులు, కవులు, కళాకారులు, పెద్దలు ఒక్కచోట కలిసి మాట్లాడుకునే చారిత్రాత్మక వేదికకు ప్రాతినిధ్యం వహించి, నిర్వహించి నిరూపించారు. దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడిగా తెలంగాణా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కవిత్వ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి నగదు బహుమతులు, పిల్లలకు జీవిత కాలం గుర్తుండిపోయేలా ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్లు, విద్యా వేత్తలతో ఇప్పించి కొత్త ఒరవడికి నాందిపలికారు. పిల్లల హృదయాలలో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది, వారి అత్యున్నత జీవన ప్రయాణానికి ఇదొక స్ఫూర్తి మంత్రమవుతుందన్నది నిజం. ఇదే దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక మీద ఎన్నో పుస్తకావిష్కరణలు నిర్వహించారు. ఇంకెన్నో మహత్తర కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించారు. కవితా సంకలనాలు, నానీల సంకలనాలు ఈ వేదిక కడుపున పుట్టి సాహితీవినీలాకాశంలో వెలుగుతారలై నిలబడ్డాయి. కరోనా కష్టకాలంలో కవిత్వాన్ని బ్రతికించడానికి ఎన్నో అంతర్జాల సాహితీసభలను ఈ వేదిక అన్నీ అయి నడిపించింది. వీరు నిర్వహించిన పుస్తకావిష్కరణల్లో వెన్నెల సత్యం గారి 'వాసంతిక' గజళ్ళు, డా. రజినీకాంత్ గారి 'పిడికెడు నానీలు', కుడికాల వంశీధర్ రచించిన 'సాఫ్ట్వేర్ నానీలు' ప్రముఖమైనవి. ప్రతీ వారాంతం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వహించడం ఈయనకు అలవాటు.
సీతారామరాజుకు సాహిత్య అధ్యయనం నిత్యకృత్యం. ఈనాటి యువకుల్లో కనిపించని భాషా మమకారం, సాహిత్యాభిరుచి ఇతనిలో మెండుగా కనిపిస్తాయి. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తూ సాహిత్యానికీ తనకూ ఉన్న బంధాన్ని పరిపుష్టం చేసుకుంటున్న కవి ఈయన. ఈ సాహిత్యాభిలాషే ఈయనచే మంచి కవిత్వం రాయించింది, నలుగురికీ నచ్చేలా చేసింది. ఈయన్ని వరించిన పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో వంగూరి ఫౌండేషన్ వారి కవితా పురస్కారాలు,్aస్త్రర వారి ప్రతిష్టాత్మక పురస్కారం, ్aఅa వారి సాహితీ పురస్కారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ పురస్కారాలే. ఉభయ రాష్ట్రాల నానీ పోటీల్లో ప్రధమ బహుమతి గెలిచి వీరి నానీ పదునుని తెలియజేసారు. వీరి సాహితీ వ్యాసాలు అన్ని దిన, వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి సమీక్షలు పుస్తకాలని చదవాలనుకునేంత గొప్పగా ఉంటాయి. ఆ సాహితీ వ్యాసాలన్నీ ఈ మధ్య 'పరావర్తనం'గా మనముందుకు వచ్చాయి. పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. ఈయన కొన్ని రోజులు 'సుజనరంజని' వెబ్ మాసపత్రికకు సహ సంపాదకుడిగా వ్యవహరించారు. మంచి సాహితీవిశేషాలని పాఠకులకు అందించారు. చాలా సంవత్సరాలుగా ుAూA తెలంగాణ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికాకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరి స్తున్నారు. దక్షిణాఫ్రికాకు వచ్చిన అనేక అతిథులకు సన్మానపత్రాలు రాసిన ఈయన మంచి మాటకారి, మంచి స్నేహితుడు, మంచి మనిషి. వీరి శ్రీమతి కవిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైగా మంచి సాహిత్యాభిలాషి, వీరి 11 సంవత్సరాల కుమారుడు అద్విక్ కూడా మంచి రచయిత. నాన్న బాటలో అక్షరాన్ని ప్రేమిస్తూ సాహితీ వనంలోకి బుడిబుడి అడుగులేస్తున్నాడు. ఈమధ్యనే 'అద్విక్ రామాయణం' పేరుతో బాల రామాయణాన్ని ఆంగ్లంలో రాసి ప్రచురించాడు. వీరి తమ్ముడు మురళీకృష్ణ, చెల్లెలు గోదాదేవి కూడా వీరి బాటలోనే పుస్తకప్రియులయ్యారు. బయటే కాకుండా ఇంట్లో కూడా స్ఫూర్తి నింపిన సీతారామరాజు అసలైన సాహితీ కృషీవలుడు.
అర్ధరాత్రి అంతరంగంలో ప్రసవవేదనపడి పొద్దున్నే ఉదయించే కవి సీతారామరాజు. ఖండాలవతల కవితా పుష్పమై పూసి జ్ఞాన పరిమళాలతో సాహితీ వనాన్ని తయారుచేసే కవి సీతారామరాజు. నానీల నావలో ప్రయాణించి సాహితీ తీరాన జెండాగా రెపరెపలాడుతున్న కవి సీతారామరాజు. ఈ కవి జలచక్రపు భాగ్యసిరిని, చినుకు సొగసుని కవిత్వంచేసి అనుభూతుల మబ్బుల్లోంచి అక్షరవాన కురిపిస్తాడు. సింగిడి రంగులనేల సౌభాగ్యాన్ని ముందుండి పాడతాడు, జీవితాన్ని చిలికి కవితామృతాన్ని పంచుతాడు. బియ్యం చెరుగుళ్లలో రైతు పాదాల చప్పుళ్ళు వింటాడు, మనకు వినిపిస్తాడు. సుషుప్తి నుంచి చైతన్యం దిశగా పరిగెడతాడు, మనల్ని పరుగులు తీయిస్తాడు. బ్రతుకుని 'కవితా'మయం చేసుకొని చిన్నచిన్న మాటలతో పెద్ద పెద్ద భావాల్ని ఆవిష్కరిస్తాడు. ఒకసారి ''మనసొక కల్లోల సింధువు మరి కన్నీరు ఉపశమన బిందువు'' అంటూ మనసుభాష మాట్లాడతాడు. మరోసారి ''నీ నోటికి మెతుకే జైకిసాన్! నీ కంటికి కునుకు జై జవాన్'' అంటూ మనిషి భాష మాట్లాడతాడు. ఇంకోసారి ''ఆకులు రాలిపోతే ఆవేదనేల పచ్చని చీరలోరాదా ఆమని హేల'' అంటూ అసలైన కవిత్వపు భాష మాట్లాడతాడు.
- గౌతమ్ లింగా, దక్షిణాఫ్రికా, 27 630255994