Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడి చుట్టూ తిరిగి వరాలను అడుక్కొకు
స్వరాలను ఒక్కటి చేసి పోరాడు..
మీసాలకి, గడ్డాలకి తగ్గ న్యాయం
ప్రశ్నించడం, తిరుగుబాటు చేయడం..
మన వల్ల ఓ చిన్న పిచ్చుకకి కూడా లాభం
లేకపోయింది అందుకేనేమో అంతరిస్తా అంటుంది.
అన్నం రైతు కష్టానికి ప్రతిఫలం ఐతది కానీ
పరబ్రహ్మ స్వరూపం ఎట్లెతది..
అన్నదానం ఆకలి అన్నవాడికి చేయాలి
తిన్నది అరగని వాడికి కాదు..
నా వల్ల ఓ పెనుమార్పు సంభవించి
తర్వాత ఈ సమాజం నన్ను మరిచిపోయినా పర్లేదు..
జంతువులను కూడా దేవునిగా భావించే
మనోల్లకి.. మనుషులు మాత్రం
మనుషుల్లాగా కనబడరే..!
ప్రపంచంలో రెండే జాతులు
ఆడ, మగ కాదు, పేద, ధనిక కాదు
చిన్న, పెద్ద కాదు
మానవత్వం ఉన్న జాతి, మానవత్వం లేని జాతి..
ఎడతెరిపి లేనిది
యాడా తెరిపీ లేనిది ప్రేమ ఒక్కటే..
ఒంటరిగా ఉన్నావా..
ఐతే వేల ఆలోచనల సమూహంతో ఉన్నట్టే..
- సాయి కీర్తి