Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనుకున్న అమ్మను
అల్లారా ముద్దుగా పెంచిన నాన్నని
ఆకాశమంతా ఎత్తులో ఎత్తుకున్న అన్నని
నేను ఎత్తుకున్న తమ్ముని
అందరి కంటే పెద్దక్కని
చిట్టి తల్లి చెల్లిని
వదిలి రావాలసిన టైమ్ వచ్చింది
మూడో తరగతిలో నాటి నీళ్లు పోసి పెంచిన
రెండు మామిడి, మూడు చింత చెట్లుని
బాల్యమంతా గడిపిన, నడిచిన గుర్తులను
వదలి రావలసిన టైమ్ వచ్చింది
యాభై ఏండ్ల పాటు నమ్ముకున్న భూతల్లిని
పెంచుకున్న ప్రేమలను
పంచుకున్న ఆత్మీయులు బంధువులను
వదిలి రావాలని లేకున్నా
గుండెల్లో బాధను
కట్లో కన్నీళ్లు దిగి మింగి
వదిలి రావలసిన టైమ్ వచ్చింది
తరాలుగా సాగుతున్న నాగలి నావ
సడుగుల్రిగింది
నాన్న చేతి ముళ్లు కర్ర మూడు
మూక్కలైయినదిజి
జోడెడ్లు పాండు, పీళ్య
బిజినాపల్లి కసాయి గోపాల్ చేతిలో హతమైనవి
పెద్ద గొర్రు చెదలు పట్టింది
ఆడి పాడిన వాకిలి పొకిలైనది
ఎక్కి కోతి కొమ్మచి ఆడిన చెట్లు జాడలేవు
బడికి నడిచిన పిల్ల బాట మాయమైనది
ఎక్కి కూత పెట్టిన గుండు
వేల ముక్కలై సిట్టికి సరుకులైనది
నాలుగు ఊర్ల బొడ్రాయి జాడలేదు
తాతల నాటి ఆస్తులు,
మా రాతలు మా తల రాతలు
మా బతుకులు ప్రాజెక్టులో నిండ మునిగినై
కాదు కాదు.....
ముంచిత్తిరి కదరా!
- బాటసారి, 9440174050