Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర కోసమే కదా పోరాటం....
ఒక్కడి కోసం
ఈ యుద్ధమేమి కాదు
తన కోసమేమి అస్సలే కాదు...
వీరుడి గుండెల్లో
బుల్లెట్ వేగమంతా ఆవేశం
శరీరం పై కొరడా దెబ్బల
రక్తపు చారలు పడుతుంటే
స్వాతంత్య్ర గడియలు
దగ్గరకొస్తున్నాయి అంటూ
పెదాల్లో చిర్నవ్వులు....
స్వాతంత్య్ర కొరడా దెబ్బలు
మనను ముద్దాడలేదు..
లాఠి దెబ్బల గాయలేవి లేవు...
ఉరి కొయ్యల తాడు
కంఠం పై మచ్చలేదు....
కానీ-
స్వాతంత్య్ర పోరాటం
చెయ్యని నేటి మనిషి
ఫలాల హక్కులను
స్వతంత్రం నా హక్కు
అంటూ
స్వేచ్ఛగా రంకెలు వేస్తున్నాడు...
మళ్ళీజి
ఈ వీరుడైనా పుట్టడా అంటే
నా స్వార్ధమే కదా...
వీరుడా మళ్ళీ పుట్టొద్దు...
- యెలగొండ రవి,
9848770345