Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నటివరకు వికసించిన
ఈ పుష్పాలు నేడు వాడిపోగా
పిల్లగాలి తెమ్మెరలకు తన్మయత్వం
చెందిన ఆ గడ్డి పరకలు నేడు
దీనంగా తలలు వాల్చేస్తే
మెరుపులు చిందించిన
ఆ చుక్కలు ఇవ్వాళ మసకబారితే
నిన్నటిదాకా ఆకర్షించిన ఆ ప్రకృతి
నను చూసి వికృతంగా నవ్వుతుంది..
సాఫీగా సాగుతున్న సమయాన్ని
జీవితం కష్టాల పలుపుతాడేసి
దురదృష్ట దిమ్మెకు కట్టేస్తే
సంతోష సాగరంలో జీవననౌక
హాయిగా సాగిపోతుంటే
కాలం కలల పయనాన్ని
నిర్లక్ష్యధోరణుల అలలతో ఢకొట్టిస్తే..
నీ ఊహల్లేని స్వప్నం అపరిపూర్ణమైతే
నీ ఊసుల్లేని గమనం అసంపూర్ణం,
జీవిత పయనం బహు భారమైతే
జీవనగమ్యం ఎంతో దూరం
నీ ఆలోచనలు లేకుండా
ఆస్వాదించగలనా జీవన సారం,
నేను చేరగలనా నా కలల తీరం..?
నువ్వే నా బలం
నువ్వే నా ఆత్మస్థైర్యం
నువ్వే కదా నా సైన్యం
నువ్వు పలకరించకపోతే
అంతటా శూన్యం
నీ చిరుదరహాసం చిందించని
వేళ ఈ బతుకేమో దైన్యం
- సర్ఫరాజ్ అన్వర్... 9440981198