Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేనొక ఒంటరి తెరువరి నీవే శరణం చివరికి
ఆశల రెక్కలు విరిగెను రాదే మరణం చివరికి
ఊహల ఒడ్డున కూర్చుని ఊపిరి పాటగ రాసితి
నేనొక పల్లవి నయితే నీవే చరణం చివరికి
మదిలో మెదిలే ఊసులు ఎదలో అలజడి రేపెను
మౌనమె మాటకు సంకెల చూపులె భాగ్యం చివరికి
మనసే తుంటరి కోయిల విరహపు గీతం పాడెను
ఆమడ దూరం ఆమని మిగిలెను శిశిరం చివరికి
తలుపులు మూసిన కిటికీ అవతల నీకై నిలిచా
తలపుల నిండా నేనని తెలిసెను సత్యం చివరికి
వేదన వేణువు పలికెను విషాద రాగాలెన్నో
బాధల గరళం మింగిన పోదే ప్రాణం చివరికి
మండే వేసవి కాలం మాటల మల్లెలు కురిసెను
చీకటి 'వెన్నెల' మధ్యన కుదరదు స్నేహం చివరికి
- వెన్నెల సత్యం, 9440032210