Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం నా కలానికొక ముద్దిస్తానని అన్నది
ఎప్పటికీ కలంతోనె నడిచొస్తానని అన్నది
మూరు?లకు భయపడితే సామాన్యుడు బ్రతుకుడెలా?
కవిత్వమే కావాల్సిన బలమిస్తానని అన్నది
మనిషితనం లేనప్పుడు దైవత్వం ఎక్కడిదీ?
నా పవిత్ర గ్రంథం నను ప్రశ్నిస్తానని అన్నది
బుర్రలేని కుర్రతనం కాదు నాది! తప్పయితే
వినయంగా సంజాయిషీ నేనిస్తానని అన్నది
బాటసారి బ్రతుకు నీది గమ్యమేదొ వెతుక్కో
వయసేమో వత్సరాలు దాటేస్తానని అన్నది
మరణానికి నేనంటే ఎంత ప్రేమ? నన్నది ఈ
నాటకాల జగతి నుండి విడిపిస్తానని అన్నది
దుఃఖం నిన్నేం చేస్తుంది లక్ష్మణా! గుర్తుందా?
ప్రళయం నీ హృదయంలో నిద్రిస్తానని అన్నది
- ఇనుగుర్తి లక్ష్మణాచారి