Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవు నవ్వుతూ ఈ నేలపై పోతుంటే
నీ నవ్వులన్నీ పువ్వులై పూస్తాయి ప్రియా...
నీవట్లా ఆకాశానికి భూమికి మధ్య తేలిపోతావుంటే
నీ నవ్వులన్నీ ఈ నేలపై చినుకులై కురుస్తాయి సఖీ...
నీవట్లా అమావాస్య రాతిరి ఆకాశం నుండి నవ్వుతుంటే
నీ నవ్వులన్నీ చుక్కలై మెరుస్తున్నవి చెలీ....
చెలీ...సఖీ...ప్రియా...
నీ నవ్వులన్నీ
పూలై పూసిన
చినుకులలై రాలిన
చుక్కలై మెరిసిన
చూస్తూ ఆస్వాదించడమే
నాకున్న అర్హత..యోగ్యత
- దిలీప్.వి, 8464030808