Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'డోంట్ డిస్టర్బ్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది వెబ్ వెర్షన్లో మాత్రమే పనిచేస్తుంది. వెబ్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న టైంలో ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేయవచ్చు. వెబ్ వెర్షన్ వినియోగదారులు సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి ఇన్కమింగ్ WhatsApp కాల్ నోటిఫికేషన్లను ఆఫ్/ఆన్ చేయవచ్చు. WaBetaInf నివేదిక ప్రకారం, ప్రస్తుతం బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ను విడుదల చేశారు. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
ఈ మధ్యకాలంలో వాట్సాప్ వరుసగా కొత్త కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతుంది. ఇంతకు ముందు నెలలో కాంటాక్ట్ కార్డ్‌లను షేర్ చేసే ఫీచర్‌ను తెచ్చింది. అలాగే, అవతార్ అనే మరో ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. అవతార్ అనేది డిజిటల్ వెర్షన్ ఫొటో. ఫొటోకు వివిధ రకాలైన హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్లను యాడ్ చేయవచ్చు. దీనిని ప్రొఫైల్ ఫిక్ గా కూడా పెట్టుకోవచ్చు.