Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి, చలి, చలి...
చలి అంటే వణుకు
చలి అంటే బెణుకు!
దవుడలు అదిరేలా చలి
వొళ్ళు పగిలేలా చలి!!
అడవిలో పులి అంటే భయం
ఇంట్లో చలి అంటే భయం !
మడుగులో మొసలికి బలం
మార్గశిరంలో చలి మరీ అధికం!!
చలి అంటే అత్తభయంకు మించి
వణుకుతున్న కోడళ్ళు
కొంకర్లు పోయి వెక్కిరిస్తున్న చేతి వేళ్ళు
ఆకుల్లో దాక్కొని
ముడుచుకుపోయిన పూమొగ్గలు
మఫ్లర్లతో మూసుకపోయిన నోళ్ళు!!
కాగిన నూనెలో వేగిన
మిర్చీ బజ్జీ రమ్మంటోంది
కప్పులో సల సల మసిలిన కాఫీ
పిలుస్తుంది
మాటి మాటికి టీ తెమ్మంటే
ఇంటావిడ విసుక్కుంటుంది!!
అన్నీ...... చూస్తూ.....
గల గల నవ్వుతుంది చలి !
ఓ చలీ....
మంటేసుకొని మేము
చుట్టూ కూర్చున్నపుడు
నీవు ఒంటరై పోతావు
పొయ్యిపై పెట్టిన
నీళ్ళ కడువను చూసి
కన్నీరు పెట్టుకుంటావు
నిన్ను ఖాతరు చేయరని
దుప్పటిపై యుద్ధమే ప్రకటిస్థావు
నిన్ను కప్పేస్తుందని
పల్లెల్లోని గొంగల్లను చూసి
ముడుచుకు పోతావు
గొంగలి పురుగులా!!
ఓ చలీ .....
అయినా నేను
ఉదయించే సూర్యుడిని అడిగా
వేకువనే రమ్మనీ !!
- జగ్గయ్య.జి, 9849525802