Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ అంటే ఏమిటి.. అదెట్లా మొదలవుతుంది? దానికి సంకేతమేమిటి.. స్నేహానికి, ప్రేమకు తేడా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఒక్కమాటలో చెప్పడం కష్టం. దీన్ని విశ్లేషించడం సముద్ర లోతును కొలవడం లాంటిదే. సంక్షిప్తంగా చెప్పాలంటే ఒకరికి దగ్గరవ్వాలని అనిపించడమే ప్రేమ. ఒకరి పట్ల అమితాభిమానం వ్యక్తపర్చడం, పొందడం కూడా ప్రేమే. రెండు హృదయాలు కలిస్తేనే ప్రేమ. ఆత్మీయతకు ప్రతీక. ప్రేమ అనేది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఒకరి కష్టాల్ని మరొకరు తనవిగా భావించేలా చేస్తుంది. శారరీక వాంఛలకన్నా హృదయ బంధానానికే ప్రాధాన్యతనిస్తుంది. ప్రేమ పదిలంగా ఉండటానికి నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. సమానత్వం ఉంటుంది. ఆత్మీయత ఉంటుంది. గౌరవం ఉంటుంది. అవగాహన ఉంటుంది. ఇవ్వడం ఉంటుంది... పుచ్చుకోవడం ఉంటుంది. స్నేహం ఉంటుంది. సహృదయత ఉంటుంది. కరుణ ఉంటుంది. ఆత్మ విశ్వాసం ఉంటుంది. నిస్వార్థం ఉంటేనే ప్రేమ నిలుస్తుంది. స్వార్థం ఉంటే ప్రేమ పటాపంచలవుతుంది.
అబద్ధాలాడొద్దు
ముఖ్యంగా అమ్మాయిలు తన బారుఫ్రెండ్లో నమ్మకాన్ని వెతుకుతుంటారు. నమ్మకం, విశ్వాసం కలిగిన ఉన్న వ్యక్తి స్థిర మనస్తత్వం కలిగి ఉంటాడని భావిస్తుంటారు. కాబోయే జీవిత భాగస్వామి నమ్మకాన్ని పొందేందుకు అబద్ధాలను అస్త్రాలుగా ఉపయోగించొద్దు. సమయానికి కలవలేకపోయినప్పుడు ఏదో సాకు చెప్పడంకన్నా కారణాన్ని సూటిగా తెలియజేయడమే మంచిది. అప్పుడే మీ పట్ల మీ లవర్‌కు విశ్వాసం ఏర్పడుతుంది. మీ వృత్తి గురించి, కటుంబ నేపథ్యం గురించి దాపరికం పనికి రాదు. అమ్మాయి దగ్గర గొప్పలు చెప్పొద్దు. ఇది మీ నైతిక విలువను పోగొట్టు తుంది. బంధం తెగడానికి అబద్ధాలు పదునైన కత్తి లా పనిచేస్తాయి. అవి నమ్మకాన్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తాయనే విషయాన్ని మరచిపోవద్దు. అలాగే మిమ్మల్ని మీ లవర్ నమ్మడమే సరిపోదు. మీరూ ఆమె/అతడిని నమ్మాలి. అప్పుడే ప్రేమ బంధం పునాదులు పటిష్టంగా ఉంటాయి. ఇద్దరి మధ్య ఏదైనా చర్చ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వాదనే నెగ్గాలనే పంతం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిలో మీరు నిజాన్ని ఆమోదిం చలేక పోతున్నారని స్పష్టమవుతుంది. ప్రేమను గెలిపించుకోవాలనే తపన ఇద్దరికీ ఉన్నప్పటికీ అబ్బాయిల విషయంలో అమ్మాయిలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. తమ ప్రేమను ఎలాగైనా అతడు గెలిపించుకుంటాడని అబ్బాయిని అమ్మాయి నమ్ముకుంటుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దానిని నిలబెట్టు కోవాలి.
అబ్బాయిలూ... మీకిది తగదు!
అమ్మాయి పరిచయం కాగానే కొందరు అబ్బాయిలు ఆమెతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మాటలతో మొదలయ్యే ఫ్రెండ్షిప్ ప్రేమగా మారాలని తహతహ లాడుతుంటారు. ఇది మీరనుకుంటున్నట్టు అంత ఈజీ కాదు. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారాలంటే ఆషామాషీ కాదు. ముందు మీ ప్రవర్తన ఆమెకు నచ్చాలి. మీ వ్యవహార మంతా ఆమె ఇష్టపడేలా ఉండాలి. చనువు పెరగడమంటే ప్రేమ చిగురించడం కాదనే విషయాన్ని గ్రహించాలి. ముందు మీరు మంచి స్నేహితుడని నిరూపించుకోవాలి. మీ స్నేహంలో స్వార్థం లేదనే విషయం ఆమె మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. అమ్మా యి వెనకాలే తిరగడం చేయకూడదు. ఏ అమ్మాయైనా నలుగురి దృష్టిలో పడొద్దని భావిస్తుంది. ఆమె బాధను అర్థం చేసుకోవాలి. ఆమె మనోభావాలు అర్థం చేసుకున్నప్పుడే మంచి స్నేహితుడిగా మీరు మార్కులు కొట్టేస్తారు.
మర్యాద ముఖ్యం
అమ్మాయి దగ్గర చాలా మర్యాదగా ప్రవర్తించాలి.ఆమెతో మీరు రాత్రి పూట చాటింగ్ చేస్తుండొచ్చు. అప్పుడు మెసేజ్‌లో కొట్టే పదాలు (అసభ్యకరంగా ఉండొద్దు) మీరు వాడొచ్చు. ఆమె వాటిపై రెస్పాండ్ అయ్యి రిప్లరు ఇవ్వొచ్చు. అంత మాత్రానా ఆమెలో మీ పట్ల ఫ్రెండ్షిప్ కాకుండా మరో ఆలోచన ఉందనే అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఒక అబ్బాయి మరో అబ్బాయి మెసేజ్‌లకు ఎలా రెస్పాండ్ అవుతాడో.. అమ్మాయి కూడా ఫ్రెండ్‌గా అలా అయ్యిందని భావించాలి.
మీ గర్ల్ ఫ్రెండ్ లవర్‌గా మారాలని మీకు ఉండొచ్చు. అదే ఫీలింగ్ ఆమెలోనూ ఉంటే ఓకే. లేదంటే ఓ మంచి స్నేహి తుడిగానే మెలగండి. అంతేగానీ... స్నేహం చేసింది కాబట్టి ప్రేమించి తీరాలని పట్టుపట్టకండి. స్నేహితురా లిని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ.. ఆమెకు ఇష్టం లేని ప్రేమను పొందాలనే ప్రయత్నమే మంచిదికాదు. ఆమె మిమ్మల్ని ప్రేమించేలా ప్రవర్తించడం వరకు ఓకే. ఆమెను ఆకర్షించాలనే ఉద్దేశంతో అమర్యాదగా ప్రవర్తించొద్దు. కావాలనే ఆమెను తాకడం, అసభ్యకరంగా మాట్లా డటం లాంటివి చేయొద్దు. ఆమెకు మీరు చేరువవ్వాలంటే చాలా దగ్గరవ్వాలని కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఇష్టం లేకుండా టచ్ చేయాలనుకోవడం శాశ్వతంగా ఆమెను దూరం చేసుకో వడమే అవుతుంది. మీ స్నేహంపై ఆమెకు నమ్మకం కలిగినప్పుడే ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది.
- హరితస్