Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూపం
తొలిప్రేమకి
మూలమో కాదో
కానీ తారసపడ్డ
ప్రతిసారీ
జివ్వుమని
లాగేసే గుండెకింది తడి
మనసు పొరల్లో
అలజడి
కంట్లో అదే రూపావిష్కరణ
ఎచ్చోట వెతికినా
ఆ రూపంకన్నా మిన్న
లేదంటున్న మనసు
నాదంటూ అనుకున్న
నాకు ప్రత్యామ్నాయ పదాలు
తొలిప్రేమ
మలిప్రేమ
తుది ప్రేమ అవే
నాటుకుపోయాయి
బలంగా
పండాలి నూరేళ్లు
- గిరిప్రసాద్ చెలమల్లు,
9493388201